News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: సిరి నువ్వు నాకు పడిపోయావ్.. వెనుక నుంచి వాటేసుకున్న షన్ను.. సన్నీ ఫైట్.. శ్రీరామ్ సైలెంట్!

‘బిగ్ బాస్’ సీజన్ 5లో సిరి.. వీజే సన్నీని టార్గెట్ చేసుకున్నట్లు అనిపిస్తోంది. చిన్న విషయాన్ని పెద్దది చేసి మరీ పోట్లాడుకున్నారు.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ ఈ రోజు వైజాగ్ ప్రజలను.. షన్ముఖ్, అతడి ఫ్యాన్స్‌ను ఖుష్ చేశాడు. ‘‘గాజువాక పిల్లా.. నేను గాజులోడిని కాదా’’ అనే సాంగ్‌తో జోష్ నింపాడు. ఆ తర్వాత షన్ను, సిరి గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ.. ఫొటోలు గురించి చర్చించుకున్నారు. ‘‘నువ్వు నాకు పడిపోయావ్. అందుకే.. నా ఫొటోలు దాచుకున్నావ్’’ అని అన్నాడు. సిరి అదేమీ లేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే.. నువ్వు విన్ అయితే నాకు కూడా సంతోషమే అని షన్ను అన్నాడు. సిరి కూడా అదే మాట అంది. ఈ ఎపిసోడ్‌లో శ్రీరామ్, మానస్‌లు చాలా సైలెంట్‌గా కనిపించారు. పెద్దగా మాట్లాడకుండా.. వివాదాల్లో చిక్కుకోకుండా ఆచీతూచి వ్యవహరించారు. కేవలం సిరి, షన్ను, సన్నీల మధ్య ఫన్, గొడవలు మాత్రమే హైలెట్ అయ్యాయి. ఇలాగైతే.. మానస్, శ్రీరామ్ ఓటింగ్‌లో వెనుకబడే అవకాశాలున్నాయి. 

షన్ను చీట్ చేశాడంటూ సన్నీ అలక: ఆ తర్వాత బిగ్ బాస్.. ఇంటి సభ్యులకు ఈ సీజన్‌లో ప్రేక్షకులు మెచ్చిన టాస్కులను ఆడించడమే కాకుండా, బహుమతులు ఇస్తానని వెల్లడించాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్.. సైకిల్ పంపు సాయంతో బెలూన్లు పగలగొట్టే టాస్క్ ఇచ్చాడు. ఇందులో సన్నీ 10 బెలూన్లు పగలగొట్టి థమ్స్ అప్ గెలుచుకున్నాడు. అయితే, సన్నీ చీటింగ్ చేసి గెలిచాడని షన్ను వాదించాడు. థమ్స్ అప్ ఇద్దరం పంచుకుందామని షన్ను చెప్పినా.. తాను గెలిచి సాధిస్తానని సన్నీ అన్నాడు. 

తాడు టాస్క్‌.. సిరి లొల్లి: ఆ తర్వాతి టాస్క్‌లో బిగ్ బాస్ టీషర్ట్స్ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టే టాస్క్ ఇచ్చాడు. ఇందులో సన్నీ, మానస్ తలపడ్డారు. చివరికి మానస్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఇచ్చిన టైమ్ టాస్క్‌లో షన్ను సరిగ్గా సమయాన్ని అంచనా వేసి విజేతగా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి నిలిచారు. ఈ టాస్కులో షన్ను బిర్యానీ గెలుచుకున్నాడు. ఆ తర్వాత సౌండ్స్‌ను గుర్తించే టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీరామ్ విజేతగా నిలిచాడు. తాడు టాస్కులో సన్నీ విజేతగా నిలిచాడు. అయితే, సన్నీ.. తాడుతో సరిగ్గా వేవ్స్ ఇవ్వలేదంటూ సిరి కామెంట్ చేసింది. సరదాగా మొదలైన ఈ వాదన పోట్లాడుకొనేవరకు వచ్చింది. ఇదిలా ఉండగా.. సిరి, షన్నుల బాండ్ మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. బాత్రూమ్ వద్ద షన్ను ఆమెను నుంచి వాటేసుకున్నాడు. సిరి వారించినా వదల్లేదు. దీన్ని ‘అన్ సీన్’లో చూపించారు.

Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి

నన్ను బ్యాడ్ చేస్తే ఏమొస్తాది? - సన్నీ: నువ్వు ఓడిపోయావ్ అంటూ సన్నీ.. సిరిని ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. అయితే, సిరి మాత్రం దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేదు. నేను ఓడిపోయానని అనొద్దని హెచ్చరించింది. ఓడిపోయావ్ అనడం జోకా అంటూ అలిగింది. ఆ తర్వాత మంచంపై షన్ను పక్కన కూర్చున్న ఆమెను కూల్ చేసేందుకు సన్నీ ప్రయత్నించాడు. నేను సరదాగానే ఆ మాట అన్నానని సన్నీ అన్నాడు. అప్పుడు జోక్‌గా అన్నాను.. ఇప్పుడు మాత్రం కాదనేసరికి.. సిరి సీరియస్ అయ్యింది. ‘‘నాపై జోకులు వేయొద్దు’’ అని గద్దించింది. నన్ను ఇమిటేట్ చేయకంటూ వేలు చూపించింది. దీంతో సన్నీ.. ‘‘నాకు వేలు చూపించొద్దు’’ అని సిరిని హెచ్చరించాడు. ‘‘ఏమనుకుంటున్నావ్ సన్నీ నువ్వు? నువ్వు హీరోవా?’’ ఎగతాళి చేసింది. పిజ్జా తినేందుకు రావాలని షన్ను కోరినా.. సిరి వెళ్లలేదు. అయితే, షన్ను మాత్రం ఆ గొడవలో ఇన్వాల్వ్ కాలేదు. పైగా గొడవ వద్దని సిరికి సూచించాడు. సిరి, షన్నులది ఓవర్ యాక్షన్ బ్యాచ్ అని, వెళ్లే ముందు నన్ను బ్యాడ్ చేస్తే వారికి ఏమొస్తుందని సన్నీ.. మానస్ వద్ద అసహనాన్ని వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓటేసేందుకు శుక్రవారం ఆఖరి రోజు. అర్ధరాత్రి 12 గంటల వరకు లైన్స్ ఓపెన్‌లో ఉంటాయి. ఆ తర్వాత ఓటేసినా ఫలితం ఉండదు. కాబట్టి.. మీ ఫెవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవాలంటే.. వెంటనే ఓటేయండి. 

Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 17 Dec 2021 07:54 AM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు manas Siri బిగ్ బాస్ 5 VJ Sunny సిరి షన్ముఖ్ జస్వంత్ Sri Rama Chandra వీజే సన్నీ మానస్

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?