అన్వేషించండి

Bigg Boss 5 Telugu: కామెడీ అంటే వెకిలి చేయడమా..? సన్నీపై షణ్ముఖ్ సీరియస్.. 

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కి రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. ఇందులో మానస్.. కాజల్, సన్నీలకు వార్నింగ్ ఇచ్చాడు.

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ముందుగా లగ్జరీ ఐటెం టాస్క్ ఒకటి ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న గులాబ్ జామున్ ల డబ్బాను చేతితో ముట్టుకోకుండా.. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఒక స్పెషల్ లగ్జరీ బడ్జెట్ ఐటెం దక్కుతుందని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ ను సిరి అందరికంటే ముందుగా పూర్తి చేసింది. ఆమె గ్యాప్ లేకుండా గులాబ్ జామున్ తింటూ ఉండడంతో సన్నీ షాకయ్యాడు. 
ఆ తరువాత షణ్ముఖ్.. సిరితో మాట్లాడుతూ.. 'నేను సీరియస్ గా చూసినప్పుడు నువ్ గేమ్ ఆడు' అని చెప్పాడు. ఇప్పుడెందుకు చెప్పావ్ అని సిరి అడగ్గా.. 'చెప్తున్నా విను..' అని అన్నాడు షణ్ముఖ్. 

రోల్ ప్లే టాస్క్: బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా  కంటెస్టెంట్స్ వేరే సభ్యుల్లా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో.. వారు ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పారు.  ముందుగా సన్నీ-సిరిల అప్పడం టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో సన్నీ.. షణ్ముఖ్ గా, సిరి.. సన్నీగా, షణ్ముఖ్.. సిరి పాత్రలో, మానస్.. యానీ మాస్టర్ గా, శ్రీరామ్.. కాజల్ గా నటించారు. అయితే నటించేప్పుడు.. సన్నీ కామెడీ కాస్త ఓవర్ గా చేయడం, తనను తక్కువ చేస్తున్నట్లుగా బిహేవ్ చేయడం షణ్ముఖ్ కి నచ్చలేదు. 

సన్నీపై షణ్ముఖ్ సీరియస్..: 'ఎకిలి కామెడీ చేశావ్.. నాకు నచ్చదు.. రవితో కూడా ఈ విషయంలో గొడవ పెట్టుకున్నా..' అని సన్నీతో అన్నాడు షణ్ముఖ్. 'ఫన్ కోసం అలా చేశానని, కామెడీ వెర్షన్ లో చేశానని.. నిన్ను హర్ట్ చేసే ఉద్దేశం లేదని' చెప్పాడు సన్నీ. ఆ తరువాత షణ్ముఖ్ కి సారీ చెప్తూ.. హగ్ చేసుకున్నాడు. ఇదే విషయంపై.. మానస్, కాజల్ లతో మాట్లాడాడు సన్నీ. కామెడీ యాంగిల్ లో ఎందుకు తీసుకోలేరంటూ షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ అన్నాడు. 

'ఒక మనిషిని తక్కువ చేయడమంటే వెకిలి చేయడం తప్ప ఇంకొకటి ఉండదా..? కామెడీ పీసా నేను..? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను.. ఓవర్ చేయకు అని.. కానీ కంటిన్యూ చేశాడు. అన్నీ అనేసి హగ్ చేసుకుంటే సరిపోతుందా..?' అంటూ సిరితో చెప్పాడు షణ్ముఖ్. 

ఆ తరువాత ఇంట్లో ప్రియాంక-మానస్ ల ప్రయాణాన్ని రోల్ ప్లే చేయమని చెప్పారు బిగ్ బాస్. సన్నీ.. ప్రియాంక గెటప్ వేస్తానని చెప్పగా.. వెంటనే కాజల్.. మానస్ క్యారెక్టర్ తీసుకుంది. సన్నీకి లంగావోణీ కట్టి, విగ్గు పెట్టి, లిప్స్టిక్ రాసి ప్రియాంక రేంజ్ లో కాకపోయినా.. మోస్తరుగా రెడీ చేశారు. సన్నీను ఆ గెటప్ లో చూసిన హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వుకున్నారు.

ఇదేంట్రా ఇలా ఉందని షణ్ముఖ్ అనగా.. సన్నీ అతడి మీదకు వెళ్లాడు. కొంచెం ప్రిపేర్ అవ్వనీ అంటూ నవ్వుతూ అన్నాడు షణ్ముఖ్. ఇక మానస్ గెటప్ లో ఉన్న కాజల్ వెనక తిరుగుతూనే ఉన్నాడు సన్నీ. ఆ తరువాత 'మానస్ ఇప్పుడు ఐలవ్యూ పింకీ అని వంద సార్లు చెప్తాడు' అని డైలాగ్ వేసింది కాజల్. దానికి మానస్ సీరియస్ అయ్యాడు. 

కాజల్, సన్నీలకు మానస్ వార్నింగ్ : 'మీరు గబ్బు చేశారంటే మాత్రం మంచిగా ఉండదు ముందే చెప్తున్నా' అని వార్నింగ్ ఇచ్చాడు మానస్. 'ఎట్లా వస్తే అట్లా వస్తాది రా బయ్ ఆగు' అని సన్నీ డైలాగ్ కొట్టగా.. 'ఎంటర్టైనింగ్ గా చేయాలిరా' అని కాజల్ అంది. దానికి మానస్ 'ఎంటర్టైనింగ్ గా చెయ్.. నువ్ ఏందీ వంద సార్లు ఐలవ్యూ.. ఎవడు చెప్పిండు ఐలవ్యూ' అని సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ, కాజల్ అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం సీరియస్ గానే తీసుకోవడంతో 'నేను మానస్ క్యారెక్టర్ చేయను' అంటూ ఏడ్చుకుంటూ.. కాజల్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. సన్నీ-మానస్ ల మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. 

ఆ తరువాత క్యారెక్టర్స్ మార్చుకున్నారు. మానస్.. ప్రియాంక గెటప్ వేయగా.. సన్నీ.. మానస్ గెటప్ వేశాడు. కాజల్.. సన్నీ గెటప్ వేసింది. శ్రీరామ్.. రోబో క్యారెక్టర్ ప్లే చేశాడు. కాసేపు వీరంతా తమ నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే పింకీ.. మానస్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసేదో.. అది ఈ టాస్క్ లో చూపించాలని అనుకున్నాడు సన్నీ. మానస్ గెటప్ లో ఉన్న సన్నీ ప్రేమగా అన్నం కలిపి.. పింకీకి తినిపించాడు. అదే సమయంలో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా వేశాడు. 'నీతో ఎప్పటికీ స్నేహం చేస్తానని.. ఏం కష్టమొచ్చినా ముందుంటానని' చెప్పడంతో కాజల్ నిజంగానే ఎమోషనల్ అయింది. ముగ్గురూ ప్రేమగా కౌగిలించుకున్నారు. 


Bigg Boss 5 Telugu: కామెడీ అంటే వెకిలి చేయడమా..? సన్నీపై షణ్ముఖ్ సీరియస్.. 

గెటప్స్ తీసేసిన తరువాత సన్నీ, కాజల్ మాట్లాడుకున్నారు. 'మానస్ కి చాలా సార్లు పింకీతో సరిగ్గా ఉండు. ఆడపిల్లకు అర్ధమయ్యేలా చెప్పు అని ఎంత చెప్పినా వాడు వినలేదు' అని సన్నీ అనగా.. 'పింకీ అర్ధం చేసుకుంటాది' అని కాజల్ చెప్పింది.  

ఆ తరువాత సిరి-షణ్ముఖ్ మాట్లాడుకున్నారు. ఆడియన్స్ తో నేరుగా మాట్లాడే ఛాన్స్ మనకి రాదేమో అని షణ్ముఖ్ అన్నాడు. 'ముందు మానస్ వెళ్తాడు.. అందుకే పింకీ గెటప్ వేశాడు. ఇప్పుడు ఆడియన్స్ ను అడిగినంత మాత్రానా..? ఓట్లు గుద్దుతారా..? ఎవరికైతే వేయాలనుకుంటారో వాళ్లకే ఓట్లు వేశారు.  జెన్యూన్ గా ఉంటే సరిపోదు ఈ హౌస్ లో.. హౌస్ నుంచి బయటకు వెళ్లినప్పుడు నాలానే ఉన్నా అనే ఫీలింగ్ ఉంటే చాలు' అని షణ్ముఖ్ అన్నాడు. 

Also Read: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు..

Also Read: షణ్ముఖ్ ఇక రియలైజ్ అవ్వడా..? సిరిని వదలడా..?

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget