Naga Manikanta Bigg Boss: బిగ్ బాస్ నాగ మణికంఠ తండ్రికి షాక్.. ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేసి, అటువంటి ఫోటోలు షేర్ చేసిన హ్యాకర్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ తండ్రికి హ్యాకర్లు షాకిచ్చారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. అశ్లీల ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.
Bigg Boss Naga Manikanta Father Instagram: 'బిగ్ బాస్ హౌస్' సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు నాగ మణికంఠ. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అందరూ అతడిని టార్గెట్ చేసినా... ఎవరూ ఊహించని రీతిలో గేమ్ ఆడుతూ టాప్ లో కొనసాగుతున్నాడు. బలమైన కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన తండ్రికి ఊహించని షాక్ ఎదురైంది. ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను దుండగులు హ్యాక్ చేశారు. అశ్లీల కంటెంట్ ను షేర్ చేశారు. అకౌంట్ హ్యాక్ విషయాన్ని మణికంఠ సోదరి కావ్య వెల్లడించింది.
అకౌంట్ హ్యాక్ గురించి కావ్య ఏం చెప్పిందంటే?
“అందరికీ నమస్తే.. నేను మీకు ఓ విషయాన్ని తెలియజేస్తున్నాను. మా నాన్నగారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు ఇన్‌స్టాగ్రామ్ ను తమ ఆధీనంలోకి తీసుకుని అడల్ట్ కంటెంట్ షేర్ చేశారు. అంతే కాదు, ఫాలోవర్స్ కు అశ్లీల కంటెంట్ కు సంబంధించి లింక్స్ షేర్ చేస్తున్నారు. దయచేసి ఆ లింక్స్ ఓపెన్ చేయకండి. ఈ విషయాన్ని మా నాన్న అకౌంట్ ను ఫాలో అవుతున్న అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ అయ్యే కంటెంట్ ను పట్టించుకోకండి. త్వరలోనే ఆయన అకౌంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంది. అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను” అని మణికంఠ సోదరి కావ్య వెల్లడించింది.
నాగమణికంఠ కామెంట్స్ పై స్పందించిన కావ్య
నాగ మణికంఠ బిగ్ బాస్ షోలో పాల్గొనే ముందు తన జీవితం అంతా కష్టాలతో కొనసాగిందని చెప్తూ బాధపడ్డాడు. తనకు పేరెంట్స్ లేరని, కట్టుకున్న భార్య వెళ్లగొట్టిందంటూ కంటతడి పెట్టాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడని, తల్లి చనిపోతే డబ్బులు అడుక్కొని అంతిమ సంస్కారాలు చేశానని చెప్పాడు. సవతి తండ్రితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. ఈ కామెంట్స్ పై రీసెంట్ గా ఆయన సోదరి కావ్య స్పందించింది. “మా నాన్న తనకు సవతి తండ్రి అంటూ అన్నయ్య చెప్పడాన్ని నెగెటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. అన్నయ్య ఆయన జీవితంలో జరిగిన అన్ని విషయాలను నిజాయితీగా చెప్పాడు. అమ్మ చనిపోయిన తర్వాత తనే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎవరూ బలవంతంగా పంపించలేదు. మాకు మా నాన్న ఎంతో సపోర్టుగా ఉన్నాడు. మా నాన్న గురించి అన్నయ్య చెప్పింది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే. దాన్ని మేం గౌరవిస్తాం. ఎవరూ నెగెటివ్ గా ప్రచారం చేయకండి” అని కోరింది.
మణికంఠ భార్యపై నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని తప్పుబట్టిన కావ్య
అటు నెటిజన్లు నాగ మణికంఠ భార్య బొద్దుగా ఉందంటూ నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని కావ్య తప్పుబట్టింది. ఆమె గురించి ఏం తెలియకుండా అడ్డగోలు కామెంట్స్ చేయడం మంచిదికాదని మండిపడింది. దయచేసి బాడీ షేమింగ్ మానుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఇక బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన నాగ మణికంఠ.. మంచి ఆటతీరుతో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Read Also: బాడీ షేమింగ్ మానుకోండి- మణికంఠ భార్యకు అండగా నిలిచిన మరదలు