అన్వేషించండి

Bigg Boss 8: బాడీ షేమింగ్ మానుకోండి- మణికంఠ భార్యకు అండగా నిలిచిన మరదలు

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నాగ మణికంఠ భార్యపై నెటిజన్లు అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారు. ‘కితకితలు‘ హీరోయిన్ గా ఉందంటూ ట్రోల్ చేస్తున్నవారు. ఈ కామెంట్స్ పై మణికంఠ చెల్లి ఆగ్రహం తీవ్ర వ్యక్తం చేసింది.

Naga Manikanta Wife Priya: బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులకు ఓరేంజిలో వినోదాన్ని పంచుతోంది. గత షోల మాదిరిగానే, ఈసారి కూడా కంటెస్టెంట్ల అరుపులు, గొడవలు, అలకలతో ముందుకుసాగుతున్నది. ఎట్టకేలకు బిగ్ బాస్ షో తొలివారం పూర్తయ్యింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు 7 జంటలుగా హౌస్ లోకి అడుగు పెట్టగా, తొలివారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. షోలో ఎవరు ఎలా ఉంటున్నారనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే, నాగ మణికంఠ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లు అందరితో కలిసి హ్యాపీగా, జాలీగా ఉంటే, మణికంఠ అందరికీ దూరంగా ఉంటున్నాడు. చీటికి మాటికి తన బాధలను గుర్తు చేసుకుంటూ తెగ ఏడ్చేస్తున్నాడు. అంతేకాదు, తన భార్యతో పాటు కుటుంబ సభ్యులపైనా నెగెటివ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్యను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

బాడీ షేమింగ్ కామెంట్స్ తప్పుబట్టిన మణికంఠ సిస్టర్..

నాగ మణికంఠ భార్య ప్రియ చూడ్డానికి కాస్త బొద్దుగా ఉన్నారు. దానికి తోడు అతడు చేసిన నెగెటివ్ కామెంట్స్ తో ఆమెపై నెటిజన్లు ద్వేషిస్తున్నారు. ‘కితకితలు’ హీరోయిన్ లా ఉందంటూ అడ్డగోలు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ పై మణికంఠ చెల్లి కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురించి గురించి ఏం తెలుసని కామెంట్స్ పెడుతున్నారంటూ మండిపడింది. ఆమె చాలా మంచి మనసున్న మనిషని.. ఇప్పటికైనా బాడీ షేమింగ్ మానుకోవాలని చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kavya Amarnadh (@kavya_amarnadh)

ఎంట్రీ నుంచే మణికంఠ సింపతీ గేమ్

మణికంఠ షోలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే సింపతీ పొందే ప్రయత్నం చేశాడు.  బిగ్ బాస్ హౌస్ లోకి  వచ్చే ముందు ప్లే చేసిన స్పెషల్ వీడియోలోనూ నాగ మణికంఠ తన బాధలను  చెప్పుకున్నాడు. తనకు పేరెంట్స్ లేరని, కట్టుకున్న భార్య  వెళ్లగొట్టిందని, చెప్తూ కావాల్సినంత సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. హౌస్ లోని వాళ్లంతా అతడిని టార్గెట్ చేయడంతో ప్రేక్షకులు ఆయనకు సపోర్టుగా నిలిచారు. పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. ఈ దెబ్బతో ఆయన టాప్ రేస్ లోకి చేరాడు.

అసలు నిజాలను బయటపెడుతున్న నెటిజన్లు

తాజాగా మణికంఠ సింపతీ గేమ్ గురించి, తన కుటుంబ సభ్యుల గురించి ఆయన చెప్పిన విషయాలు వాస్తవం కాదని నెటిజన్లు బయటపెడుతున్నారు. మొదట్లో తన భార్య గురించి, తల్లిదండ్రుల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆయన ఆ తర్వాత తన భార్య ప్రియ కారణంగానే ఈ హౌస్ లోకి వచ్చానని చెప్పాడు. ఆమె పంపించిన డబ్బుతోనే షాపింగ్ చేశానని చెప్పాడు. తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని, ఆమె బంగారం అని చెప్పుకొచ్చాడు. చిన్న మనస్పర్థల కారణంగానే ఆమెకు తూరంగా ఉంటున్నాని చెప్పాడు. ఆమెను చాలా మిస్ అవుతున్నట్లు వెల్లడించాడు.  గతంలో ఆమె గురించి తప్పుగా ప్రచారం చేసిన మణికంఠ ఇప్పుడు ఆమె మంచిదని చెప్పడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. అతడివన్నీ మోసపూరిత మాటలేనని మండిపడుతున్నారు. అతడు తన తండ్రి మీద చేసిన కామెంట్స్ కూడా తప్పే అంటున్నారు. మణికంఠ పేరెంట్స్, సిస్టర్  అతడితో ఎంత ప్రేమగా ఉన్నారో చూడండి అంటూ అతడి పెళ్లి వీడియోను షేర్ చేస్తున్నారు. మణికంఠ కారణంగా అతడి ఫ్యామిలీ మెంబర్స్ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget