బిగ్‌బాస్ 8 సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్.. ట్విస్ట్ ఇదే
రెండో వారంలో కూడా మణికంఠ సక్సెస్‌ఫుల్‌గా నామినేషన్స్‌లోకి వచ్చేశాడు. ఈ వారం గేమ్ మార్చుకోవాలంటూ నాగార్జున కూడా ఇతనికి వార్నింగ్ ఇచ్చారు.
నామినేషన్స్‌లో లేని విష్ణుప్రియను యశ్మీ నేరుగా నామినేట్ చేసింది. తనకి సంబంధించిన విషయాల్లో విష్ణు బాగానే స్టాండ్ తీసుకుంటుంది.
గతవారం టాస్క్‌ల్లో నైనిక మరో చీఫ్‌కి సపోర్ట్ చేసిందంటూ ఈమెను నామినేట్ చేశారు. నామినేషన్స్ తర్వాత.. హౌజ్నుంచి వెళ్లిపోతానమో అనే టెన్షన్‌తో ఈమె ఏడ్చింది కూడా.
సీతక్క చెత్త గొడవను మాత్రం వదల్లేక పోతుంది. తన వాదనలో నిజాయితీ ఉన్నా.. కొన్నిరోజులుగా ఇదే చెత్త గొడవను వినడం ప్రేక్షకులకు బోరింగ్‌గా ఉంది.
శేఖర్ బాష కూడా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో నామినేషన్లో ఉన్నారు. టాస్క్‌ల్లో అతను మంచి ప్రదర్శన ఇస్తే.. ఇంట్లో మంచి ఎంటర్టైనర్ అవుతాడంటున్నారు నెటిజన్లు.
క్లాన్స్‌కి హెడ్‌గా ఉన్న నిఖిల్ సోనియా మాయలో పడి గేమ్‌ని చెడగొట్టుకున్నాడనేది నిజం. టఫ్ కంటెండర్‌గా ఉండాల్సిన అతను అందరితో మాటలు అనిపించుకుంటున్నాడు.
శివాజీ టెక్నిక్స్‌ను ఫాలో అయి.. బిగ్‌బాస్‌లో మరో శివాజీ కావాలనుకుంటున్నారు. కానీ ఆయన పార్టిసిపేషన్ ఎక్కడ ఇంప్రెసివ్‌గా లేదు.
సోనియా మాయలోకి ఈయన కూడా మెల్లిగా వెళ్తున్నాడు. అయితే టాస్క్ విషయంలో సీరియస్‌గా లేడంటూ అతనిని నామినేట్ చేశారు.
సోనియాను విష్ణుప్రియ నామినేట్ చేసినా.. బిగ్‌బాస్ ఆమె పేరు తీసుకోలేదు. ప్రేరణను సేవ్ చేస్తూ.. విష్ణుప్రియను యశ్మీ నేరుగా నామినేట్ చేసింది.