ఒక్కవారమే ఉన్నారుగా

మొదటివారమే ఎలిమినేట్ అయిన బిగ్​బాస్ కంటెస్టెంట్లు.. సీజన్ 1 నుంచి 8 వరకు లిస్ట్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

జ్యోతి

తెలుగులో బిగ్​బాస్ సీజన్ మొదలయ్యాక మొదటి సీజన్​లో మొదటివారమే వెళ్లిన కంటెస్టెంట్​గా మిగిలిపోయింది.

సంజన

నాని హోస్ట్​గా వచ్చిన సీజన్​ 2లో వచ్చిన సంజన అన్నె మొదటి వారమే ఎలిమినేట్ అయింది. ఈమె మిస్​ హైదరాబాద్. మోడల్​గా బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్లి మొదటివారమే వెళ్లి బయటకు వచ్చేసింది.

హేమ

నాగార్జున హోస్ట్​గా బిగ్​బాస్​ మొదలైన తర్వాత హేమ సీజన్ 3లో కంటెస్టెంట్​గా వెళ్లింది. మొదటివారంలోనే బయటకు వచ్చేసింది.

సూర్య కిరణ్

బిగ్​బాస్​ 4వ సీజన్​లో సూర్య కిరణ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా వెళ్లి మొదటివారమే ఎలిమినేట్ అయ్యారు.

సరయు

సరయు అంటే ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ.. 7 ఆర్ట్స్ సరయు అంటే చాలా మందికి తెలుసు. యూట్యూబర్​గా బిగ్ బాస్ హౌజ్​లోకి వెళ్లి మొదటివారమే బయటకు వచ్చేసింది.

శని

సై మూవీ ఫేమ్ శని బిగ్​బాస్ సీజన్ 6 కంటెస్టెంట్​గా వెళ్లాడు. మొదటివారంలోనే బిగ్​బాస్​ హౌజ్​ నుంచి వచ్చేశాడు.

కిరణ్ రాథోడ్

బిగ్​బాస్ సీజన్ 7లో కిరణ్ రాథోడ్ కంటెస్టెంట్​గా వెళ్లి.. మొదటివారమే బయటకు వచ్చేసింది.

బెజవాడ బేబక్క

మొదటివారమే బయటకు వచ్చిన కంటెస్టెంట్​లలో బేబక్క కూడా చేరింది. ఈ వారం బిగ్​బాస్ సీజన్ 8లో బెజవాడ బేబక్క బయటకు వచ్చేసింది.

సంపూర్ణేష్ బాబు

మొదటి సీజన్​లో బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లిన సంపూర్ణేష్ బాబు.. పర్సనల్ రీజన్స్​తో 9 రోజులకే బయటకు వచ్చేశారు.

నయని పావని..

బిగ్​బాస్ సీజన్ 7లో వెళ్లి.. ఊహించని పరిణామంలో ఒక్కవారమే హౌజ్​లో ఉండి.. ఓట్లు రాక బయటకు వచ్చేసింది.