Big Boss Season 8: బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ మారిందా? హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?
Big Boss Season 8: బిగ్ బాస్ సీజన్ - 8 సెప్టెంబర్ 1న ఈ షో ప్రారంభం కాబోతుంది. కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి.
Big Boss Season 8 Contestans List: బిగ్ బాస్.. ఈ షోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొత్త సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాందా అని వెయిట్ చేస్తుంటారు బిగ్ బాస్ లవర్స్. షో ప్రారంభమయ్యే మూడు నెలల ముందు నుంచే సోషల్ మీడియాలో బిగ్ బాస్ డిస్కషన్ మొదలవుతుంది. కంటెస్టెంట్స్ ఎవరు? ఎంతమంది? హోస్ట్ ఎవరు? లాంటి విషయాల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు సీజన్ - 8 ప్రారంభం కానుంది. ఆ సీజన్ కి సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటికి వస్తూనే ఉంది. కంటెంస్టెంట్ల లిస్ట్ ఎప్పటికప్పుడు లీక్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఆ లిస్ట్ లో ట్విస్ట్ ఉందట. కంటెస్టెంట్ లిస్ట్ మారిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఎవరు ఆ కంటెస్టెంట్ లు? అసలు కంటెస్టెంట్ లు ఎవరో ఒకసారి చూద్దాం.
వాళ్లంతా ఔట్..
బిగ్ బాస్ సీజన్ 7 అయిపోక ముందే.. సీజన్ - 8 లో వాళ్లుంటారు, వీళ్లుంటారు అనే పుకారు పుట్టుకొచ్చింది. దాంట్లో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఫేమస్ అయిన బర్రెలక్క, ఫుడ్ స్టాల్ తో యూట్యూబ్ లో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ ఈసారి బిగ్ బాస్ లో ఉంటారని, దాదాపు కన్ఫామ్ అయిపోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక మై విలేజ్ షో అనిల్, యాదమ్మ రాజు, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ తదితరులు ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే, వాళ్లంతా ఈ సీజన్ లో ఆడటం లేదట. ఇంటర్వ్యూ స్టేజ్ లోనే వాళ్లకు నో చెప్పేసినట్లు వార్తలు బయటికి వస్తున్నాయి.
వీళ్లంతా వెళ్లే అవకాశం..
బిగ్ బాస్ సీజన్ - 8 కి 12 మంది కన్ఫామ్ అయ్యారని, వాళ్లంతా కచ్చితంగా హౌస్ లో కనిపిస్తారని ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. వాళ్లే.. యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ సౌమ్య రావ్, సీరియల్ నటుడు నిఖిల్, అంజలి, ఊర్మిల చౌహాన్, బెజవాడ బేబక్క, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ, సింగర్ సాకేత్, అలీ సోదరుడు ఖయ్యూం, రాహు సినిమా హీరో అభిరామ్, యూట్యూబర్ సోనియా సింగ్ పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక పోయిన సీజన్ కంటెస్టెంట్ అమర్ దీప్ భార్య తేజస్వీ గౌడ, సన, ఇంద్రనీల్, అభినవ్ గోమఠం ఈ నలుగురు వెళ్లాలా వద్దా? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గేమ్ నుంచి నలుగురు..
నిజానికి మొదట్లో కంటెస్టెంట్స్ లిస్ట్ వేరుగా ఉంది. అయితే, లాస్ట్ మూమెంట్ కంటెస్టెంట్ లను మార్చారట నిర్వాహకులు. మా టీవీలో వస్తున్న కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గార్ల్స్ గేమ్ షో నుంచి ఎక్కువ మంది కంటెస్టెంట్ లను తీసుకున్నారట ఈసారి. దీంతో ముందుగా ఓకే చెప్పిన వాళ్లకి కూడా బెటర్ లక్ నెక్ట్స్ టైం అని చెప్పారనే టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఎవరెవరు ఫైనల్ అయ్యారనే విషయం మాత్రం సెప్టెంబర్ 1 వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇప్పటికే ఈసారి అన్ లిమిటెడ్ ఫన్ అంటూ హోస్ట్ నాగార్జున ప్రోమోలు రిలీజ్ చేశారు. బిగ్ బాస్ పాట కూడా రిలీజ్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా సెప్టెంబర్ 1 ఎప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు.
Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు