Happy Birthday Chiranjeevi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు
Chiranjeevi Birthday: పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబసమేతంగా తిరుమల వచ్చిన ఆయన విఐపీ బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Chiranjeevi Visited Tirumala : మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్న చిరు.. గురువారం ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు టీటీడీ అధికారులు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచన ఇచ్చిన పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిరంజీవి వెంట ఆయన భార్య సురేఖ, తల్లి అంజనా దేవి, చిన్న కూతురు శ్రీజ, మనవరాళ్లు ఉన్నారు.
ఆపద్బాంధవుడు అన్నయ్య..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ తన అన్నకి బర్త్ డే విషెస్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు పవన్. ఈ సందర్భంగా చిరుతో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. నా ఆపద్బాంధవుడు అన్నయ్య అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు పవన్. "నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో! గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.
ఆపద్బాంధవుడు అన్నయ్య
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2024
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య… pic.twitter.com/rNHfPWP03g
వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్..
మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22 గురువారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులు ఆయన పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం చిరు బర్త్ డే విషెస్ తో మారుమోగిపోతుంది.
రీ రిలీజ్ ల సందడి..
మెగాస్టార్ పుట్టిన రోజున చిరు నటించిన రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలను రీ రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్లు. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర తెగ సందడి చేస్తున్నారు. ఇక చిరు బర్త్ డే సందర్భంగా విశ్వంభర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు యువి క్రియేషన్స్ వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ లుక్ కోసం ఆతృతగా ఎదరుచూస్తున్నారు. చిరంజీవి నటిస్తోన్న 156వ సినిమా ఇది. మైథలాజికల్- అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. వశిష్ట దర్శకుడు. వశిష్ట ఇదివరకు నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు. తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇక చిరుతో కూడా కచ్చితంగా హిట్ కొడతాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Also Read: శివ శంకర వరప్రసాద్ నుంచి 'పద్మవిభూషణ్' వరకు - ఈ 'విశ్వంభరుడి' గురించి ఈ విషయాలు తెలుసా?