అన్వేషించండి

Chiranjeevi Birthday: శివ శంకర వరప్రసాద్‌ నుంచి 'పద్మవిభూషణ్' వరకు - ఈ 'విశ్వంభరుడి' గురించి ఈ విషయాలు తెలుసా? 

Chiranjeevi Birthday Special: మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో మొత్తం ఆయన బర్త్‌డే వేడుకలతో నిండిపోయింది. సినీ,రాజకీయ ప్రముఖులు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Happy Birthday Megastar Chiranjeevi: 'మెగాస్టార్‌' చిరంజీవి టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఈ పేరోక బ్రాండ్‌. ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోలెందరికో ఆయనే స్పూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా 'స్వయంకృషి'తో ఎదగి మెగా కాంపౌండ్‌కి మహావృక్షంలా నిలిచాడు. ఆ నీడలోనే మెగా హీరోలంతా ఎదిగారు.. ఎదుగుతున్నారు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌ అందించి నిర్మాతల 'ఆపద్బాంధవుడు' అయ్యాడు. ఎన్నో అపజయాలు, తిరస్కరింపులు వచ్చిన వెనకడుగు వేయకుండ ప్రతిభనే నమ్ముకుని 'చాలేంజ్‌'గా ముందకు సాగాడు. సినిమా చాన్స్‌లు అందుకుంటూ వరుస హిట్స్‌తో 'విజేత'గా నిలిచాడు. దశాబ్ధాలుగా బాక్సాఫీస్‌ను 'హిట్లర్'లా ఏలుతున్న ఈ వెండితెర 'ఇంద్రుడి' 69వ పుట్టిన రోజు నేడు. ఆగస్టు 22 చిరంజీవి బర్త్‌డే. ఈ సందర్భంగా నటుడిగా ఈ 'విశ్వంభరుడి' సినీ ప్రస్థానంపై ఓ లుక్కేయండి!

నటనలో నిత్య విద్యార్థిగా..

చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించాడు. నటనపై ఆసక్తితో చదువు పూర్తి చేసి 1976లో చెన్నై రైలు ఎక్కాడు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణ పొందాడు. రెండేళ్లలోనే 1978లో 'పునాది రాళ్లు' సినిమాతో హీరోగా వెండితెర తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాతో శివ శంకర వరప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారాడు. ఆ తర్వాత ఈ పద్మవిభూషణులు వెనక్కి చూసుకునే అవకాశరం రాలేదు. నటనలో నిత్య విద్యార్థిగా తనలో కొత్త నటుడిని చూసుకున్నాడు.

సినిమా సినిమాకు హీరోగా ఎదుగుతూ నటుడిగా ఒదిగిపోయి వెండితెరపై రికార్డుల మోత మోగించాడు. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో హిట్స్‌, సూపర్‌ హిట్స్‌ ఉన్నా అందులో ఆయనను మెగాస్టార్‌గా నిలబెట్టిన మైలురాయి చిత్రాలు కొన్ని ఉన్నాయి. అవే "ఖైదీ (1983), ఛాలెంజ్‌ (1984), చంటబ్బాయి (1986), స్వయంకృషి (1987), రుద్రవీణ(1988), కొండవీటి దొంగ(1990), జగదేకవీరుడు అతిలోకసుందరి (1990), గ్యాంగ్‌ లీడర్‌ (1991), ఘరానా మొగుడు (1992), అపద్భాంధవుడు (1992), ముఠా మేస్త్రీ (1993), ఇంద్ర (2002), ఠాగూర్‌ (2003), ఖైదీ నెం.150 (2017), సైరా నరసింహారెడ్డి (2019), గాడ్‌ ఫాదర్‌(2022)" చిత్రాలు ఆయన కెరీర్‌ ఓ మార్క్‌గా నిలిచాయి. 

బ్రేక్‌ డ్యాన్స్‌కి కేరాఫ్‌

చిరంజీవి అనగానే అందకి టక్కున గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్‌. ఎలాంటి స్టేప్‌ అయిన అలవోకగా వేస్తాడు. బ్రేక్‌ డ్యాన్స్‌కు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌. మొదటి నుంచి తనదైన శైలిలో డ్యాన్స్‌ ప్రదర్శిస్తూ అభిమానులను సమ్మోహన పరుస్తూ వస్తున్నాడు. బ్రేక్‌ డ్యాన్స్‌లోనూ ఆయనకేవరూ పోటీ లేరనే చెప్పాలి. ఇక ఇండస్ట్రకీలో ఆయన ఎక్స్‌ప్రెషన్‌ కింగ్‌ అనే చెప్పాలి. ఫన్సీ సీన్‌ అయినా, రొమాంటిక్‌ సిన్స్‌లో తన హావభావాలతో ప్రత్యేకంగా నిలుపుతున్నారు. ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రేషన్స్‌తో అభిమానులను హత్తుకుంటాడు. ఇక సీరియస్‌ సీన్స్‌లో చూపుతోనే వణుకు పుట్టిస్తాడు. అంతగా ఆయన కళ్లులో ఫైర్‌ కనిపించేది. ఏదైనా సాధించాలనే కళ్లలో కసి, మెరుపులా కదిలే బాడీ. ఎలాంటి ఎక్స్‌ప్రేషన్స్‌ అయినా ప్రత్యేకంగా పలికించే అభినయం.. మొత్తంగా నేను అనుకున్నది సాధించగలను అన్న అంతులేని ఆత్మవిశ్వాసమే ఆయనను 'మెగాస్టార్‌'ను చేసింది. అందరిలో తాను ఒక్కడిని అనుకొకుండా నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. 

పాత్రల్లో వైవిధ్యం 

ఇలాంటి పాత్ర అయితేనే చేస్తానని హద్దులు పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీరోగానే కాదు విలన్‌గానూ మెప్పించాడు. విలన్‌గా భయపెట్టడమే కాదు కామెడీతో నవ్వించగలను అని 'చంటబ్బాయి' సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నాడు. సినిమాల్లో ప్రత్యేకమై పాత్రల్లో నటించి నటుడిగా వైవిధ్యతను చూపించారు. మల్టిస్టారర్‌ సినిమాలు చేస్తూ మెల్లిగా సోలో హీరో అవకాశాలు అందుకున్నాడు. హీరో ఎన్నో చాలేంజింగ్‌ పాత్రలు చేశారు. 'కొదమసింహం' వంటి చిత్రాల్లో కౌ బాయ్‌గా చేశాడు. అలా వైవిధ్యమైన పాత్రలతో ఆకర్షిస్తూ తక్కువ టైంలోనే 'చిరంజీవి'గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు.

అప్పటికే ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, శోభన్‌ బాబు, కృష్ణ వంటి ఎంతో మంది సీనియర్ హీరోలున్నారు. వారంత అప్పటికే వారంత శిఖరాల్లాంటి వారు. కానీ ఏమాత్రం తడబడకుండా టాలెంట్‌నే నమ్ముకుని ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో మకుటం లేని మహారాజుగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అగ్రస్థాయికి చేరుకున్న అదే ఒదిగిపోయే తత్త్వంతో కష్టేఫలి అని నమ్మిన ఈ 'త్రినేత్రుడు' మరిన్ని శిఖరాలు చేరుకోవాలి ఆశిస్తూ మరోసారి ఈ 'పద్మవిభూషణుడి'కి పుట్టిన రోజు శుభకాంక్షలు.

Also Read: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget