Bigg Boss OTT Telugu: అఖిల్ ఈజ్ ఆన్ ఫైర్ - కారణమేంటంటే?
ఛాలెంజర్స్ టీమ్.. తమను సర్వెంట్స్ గా ట్రీట్ చేసే విధానం బాలేదని అఖిల్ ఫీలయ్యాడు. ఇంట్లో మన సర్వెంట్స్ ని అలా ట్రీట్ చేయం కదా అంటూ తన వారియర్స్ టీమ్ తో చెప్పాడు.
వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టగా.. ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్, తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు. లంచ్ విషయంలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తరువాత అషురెడ్డి, తేజస్విల మధ్య గొడవ జరిగింది.
ఆ తరువాత ముమైత్, అఖిల్ కూర్చొని తమ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నారు. ముమైత్ ది చిన్నపిల్లల మైండ్ సెట్ అంటూ చెప్పాడు అఖిల్. ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ కి టాస్క్ లు ఇస్తుండడంతో అఖిల్.. చైతుపై కోప్పడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం.. ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ తో పనులు చేయించుకోవాలే తప్ప టాస్క్ లు ఇవ్వకూడదని అన్నారు. ఈ విషయాన్ని చైతు.. తన ఛాలెంజర్స్ టీమ్ తో క్లారిటీగా చెప్పడంతో వారంతా అంగీకరించారు. అయితే ఛాలెంజర్స్ ని ఇంప్రెస్ చేస్తేనే.. వారి దగ్గర నుంచి బెడ్ రూమ్ యాక్సెస్, బట్టలను దక్కించుకోవచ్చు కాబట్టి వారియర్స్ వాళ్లు చెప్పినట్లుగా వినడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.
అయితే ఛాలెంజర్స్ టీమ్.. తమను సర్వెంట్స్ గా ట్రీట్ చేసే విధానం బాలేదని అఖిల్ ఫీలయ్యాడు. ఇంట్లో మన సర్వెంట్స్ ని అలా ట్రీట్ చేయం కదా అంటూ తన వారియర్స్ టీమ్ తో చెప్పాడు. మనం ఇన్స్పిరేషన్ తో ఉండాలే తప్ప.. వాళ్లు చెప్పే పనులన్నీ చేయడం కాదని మండిపడ్డాడు. తీరా పనులు చేయించుకొని మనకి కావాల్సినవి ఇవ్వకపోతే ఏంటని ప్రశ్నించాడు. దీంతో వారియర్స్ టీమ్ అందరూ కలిసి ఒక మాట మీద ఉండాలని ఫిక్స్ అయ్యారు.
Also Read: 'బిగ్ బాస్ మేళా' ఎవరెవరికి ఏ పనులు కేటాయించారంటే?
Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్:
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5)
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)