Bigg Boss Non Stop: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!
‘బిగ్ బాస్’లో రెండో రోజు ఆసక్తికర చర్చలతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సభ్యులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. అయితే, అసలు కథ ముందుంది.
Bigg Boss Non Stop | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ సరదాగా సాగిపోతోంది. రెండవ రోజు హౌస్‌లో సభ్యులంతా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. మార్నింగ్ నుంచి కసరత్తులు చేస్తూ.. తమని తాము బిజీగా ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు తేజస్వి, నటరాజ్ మాస్టార్‌లు కిచెన్‌లో వంటలతో తీరికలేకుండా కనిపించారు. మిత్రా బిగ్ బాస్ మొత్తాన్ని శుభ్రం చేస్తూ కనిపించింది. అఖిల్, అజయ్, అనిల్, ముమైత్ ఖాన్‌లు జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు. అజయ్, అఖిల్‌లు ఇతర కంటెస్టెంట్లకు జిమ్ పాఠాలు చెబుతూ కనిపించారు. ఇది 24 గంటల షో కావడంతో కంటెస్టెంట్లు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. ఈ సందర్భంగా సరయు, చైతూ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
❂ ‘‘నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ సరయూ.. ఆర్జే చైతూను కాసేపు ఆట పట్టించింది. దీంతో చైతూ సరయు తో మాట్లాడుతూ ఈ ఆఫర్‌లో డిస్కౌంట్స్ ఉంటాయా అని అడిగాడు. మరోవైపు హమీదా, నటరాజ్ కిచెన్‌లో కాసేపు సందడి చేశారు. నటరాజ్ ‘‘ఏం మాట్లాడుతున్నావ్, నరాలు కట్ అయిపోతున్నాయ్’’ అని అంటే.. హమీదా మరోలా అర్థం చేసుకుని.. ‘‘బిగ్ బాస్.. నా నరాలు కట్ చేస్తానని నటరాజ్ అంటున్నారు’’ అంటూ హంగామా చేసింది. దీంతో దోసలు వేస్తున్న నటరాజ్.. అట్లకర్ర చూపిస్తూ ‘‘వాతలు పెడతా’’ అన్నాడు. దీన్ని కూడా హమీదా వదిలి పెట్టకుండా సందడి చేసింది. అయితే, ఇదంతా సరదాకు మాత్రమే చేయడంతో నటరాజ్ కూడా సీరియస్‌గా తీసుకోలేదు.
❂ ఈ రోజు అందరి కంటే ముందే నిద్రలేచాడు ఆర్జే చైతూ. బిగ్ బాస్‌తో కబుర్లు చెబుతూ కాసేపు టైంపాస్ చేశాడు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్లలో పాట వేసిన తర్వాతే అంతా నిద్రలేస్తారు. అయితే, ఈ సీజన్లో ఉదయం 10 గంటలు కావస్తున్నా బిగ్ బాస్ సాంగ్ వేయలేదు. దీంతో చైతూ, తేజస్వీ(తేజూ), అరియానా, సరయూ, హమీదాలు సాంగ్ కోసం వేచి చూస్తున్నారు. చైతూ తనకు ఎన్టీఆర్ పాట కావాలని చెప్పాడు. తనకు ‘‘చీమ చీమ..’’ పాట కావాలని తేజూ కోరింది. సరయూ తనకు మెగాస్టార్ సాంగ్ కావాలని అడిగింది.
❂ గార్డెన్ ఏరియాలో కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో అరియానా.. చైతూతో తమ గోవా టూర్ గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా తేజూ ‘‘నీకు అరియానా ముందే తెలుసా?’’ అని అడిగింది. ‘‘ఇండస్ట్రీలో ఐదేళ్ల నుంచి ఉంటున్నా.. నేను ఎవరికీ తెలియనా’’ అని అన్నాడు. ‘‘అంటే తెలియడం వేరు, స్నేహం వేరు కదా’’ అని తేజూ అంది. దీంతో చైతూ స్పందిస్తూ.. ‘‘బిగ్ బాస్ సీజన్-4 ముగిసిన తర్వాత అరియానా, నేను గోవా టూర్‌కు వెళ్లాం. అక్కడ మేము’’ అని చెబుతూ వేరే టాపిక్‌లోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం అంతా గార్డెన్ ఏరియాలో కూర్చొని ‘సాంగ్’కు డ్యాన్స్ చేద్దామని చూస్తున్నారు. సరిగ్గా 10 గంటలకు ‘భిమ్లా నాయక్’ సినిమాలోని ‘లా.. లా.. భీమ్లా’ పాటతో అందరినీ ‘బిగ్ బాస్’ మేల్కొలిపాడు.