అన్వేషించండి

Bigg Boss Non Stop Live Updates: నామినేషన్ ప్రక్రియ షురూ - మళ్లీ వారియర్స్ కి షాకిచ్చిన బిగ్ బాస్

‘బిగ్ బాస్’ హౌస్‌లో 2వ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ఈ పేజ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Bigg Boss Non Stop Live Updates: నామినేషన్ ప్రక్రియ షురూ - మళ్లీ వారియర్స్ కి షాకిచ్చిన బిగ్ బాస్

Background

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ - నాన్‌స్టాప్’ ఓటీటీ సీజన్-1 శనివారం మొదలైపోయింది. హోస్ట్ అక్కినేని నాగార్జున 17 మంది సభ్యులను హౌస్‌లోకి పంపించారు. వీరిలో పాత, కొత్త కంటెస్టెంట్స్ ఉన్నారు. అంటే.. ‘బిగ్ బాస్’ గత సీజన్లలో ఎలిమినేట్ అయిన సభ్యులను మళ్లీ ఒకే వేదిక మీద చూసే అవకాశాన్ని ‘బిగ్ బాస్’ కల్పించాడు. ఈ నేపథ్యంలో ఆట మరింత రంజుగా ఉండనుంది. గత సీజన్లతో పోల్చితే బిగ్ బాస్ భిన్నంగా, కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. మరి, ఆ హైలెట్స్ ఏమిటో చూసేయండి మరి. 

⦿ ఈ బిగ్ బాస్‌లో 17 మంది సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. 
⦿ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్లు 100 రోజులు ఉండేవారు. ఓటీటీ వెర్షన్‌ మాత్రం 84 రోజులకే ముగియనుంది. 
⦿ సాధారణ ‘బిగ్ బాస్’ సీజన్లలో అంతా కొత్త సెలబ్రిటీలే ఉంటారు. కానీ, ఈ బిగ్ బాస్‌లో మాత్రం గత సీజన్లో ఎలిమినేటైన సభ్యులు కూడా ఉన్నారు. 
⦿ గత సీజన్‌లో ఉన్న సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులును ఛాలెంజర్స్‌గా విభిజించారు. 
⦿ ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారికి ఒక ‘హ్యాష్‌ట్యాగ్‌’ను ఇచ్చారు. వారు హౌస్‌లో ఎలా ఉండనున్నారో చెప్పేందుకు ఇదొక ట్యాగ్.
⦿ గత సీజన్లో ఉన్న బిగ్ బాస్ హౌస్ కంటే.. ఓటీటీ ‘నాన్ స్టాప్’ సీజన్ హౌస్ చాలా పెద్దదిగా, విశాలంగా ఉంది. 
⦿ ఈ సారి గార్డెన్ ఏరియాలో స్విమ్మింగ్ పూల్‌తోపాటు బాత్ టబ్ కూడా ఏర్పాటు చేశారు. 
⦿ గత సీజన్లలో కంటే.. భిన్నంగా, కలర్‌ఫుల్‌గా హౌస్ డిజైన్ చేశారు. 
⦿ రెగ్యులర్ ‘బిగ్ బాస్’ సీజన్లలో కంటే ఎక్కువ టాస్క్‌లు ఈ కొత్త సీజన్లో ఉండనున్నాయి. 
⦿ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ 24x7 టెలికాస్ట్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే, శనివారం మాత్రం రికార్డెడ్ ఎపిసోడ్స్‌ను మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత లైవ్ టెలికాస్ట్ మొదలుపెట్టారు. 

బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్: 
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5) 
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
 
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్) 

22:20 PM (IST)  •  27 Feb 2022

నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే :

ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, అఖిల్. 

20:12 PM (IST)  •  27 Feb 2022

నామినేషన్ ప్రక్రియ షురూ

ఈరోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ప్రతి ఒక్కరూ.. వారియర్స్ టీమ్ నుంచి ఇద్దరు సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపడానికి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజర్స్ టీమ్ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్లకి కొన్ని ట్యాగ్స్ ను ఇచ్చి కారణాలు చెప్పి నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. అంటే ఈ వారం ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఎవరూ కూడా నామినేషన్ లో ఉండరన్నమాట.

19:21 PM (IST)  •  27 Feb 2022

యాంకర్ శివపై ముమైత్ కామెంట్స్: 

అఖిల్ రెండు, మూడు సార్లు బిగ్ బాస్ పంపించిన టాస్క్ రూల్స్ చదివి వినిపించుకున్నాడు. తరువాత అఖిల్, ముమైత్, స్రవంతి, అజయ్ కూర్చొని మాట్లాడుకున్నారు. యాంకర్ శివ గురించి మాట్లాడుకున్నారు. 'అతడు బయట వేరు ఇక్కడ వేరు' అంటూ స్రవంతి చెప్పింది. శివ టూమచ్ చేస్తున్నాడని ముమైత్ అంది. 

17:58 PM (IST)  •  27 Feb 2022

ఛాలెంజర్స్ టీమ్ పై అఖిల్ ఫైర్:

ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ కి టాస్క్ లు ఇస్తుండడంతో అఖిల్.. చైతుపై కోప్పడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం.. ఛాలెంజర్స్ టీమ్.. వారియర్స్ తో పనులు చేయించుకోవాలే తప్ప టాస్క్ లు ఇవ్వకూడదని అన్నారు. ఈ విషయాన్ని చైతు.. తన ఛాలెంజర్స్ టీమ్ తో క్లారిటీగా చెప్పడంతో వారంతా అంగీకరించారు. అయితే ఛాలెంజర్స్ ని ఇంప్రెస్ చేస్తేనే.. వారి దగ్గర నుంచి బెడ్ రూమ్ యాక్సెస్, బట్టలను దక్కించుకోవచ్చు కాబట్టి వారియర్స్ వాళ్లు చెప్పినట్లుగా వినడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ఛాలెంజర్స్ టీమ్.. తమను సర్వెంట్స్ గా ట్రీట్ చేసే విధానం బాలేదని అఖిల్ ఫీలయ్యాడు. మనం మన సర్వెంట్స్ ని అలా ట్రీట్ చేయం కదా అంటూ తన వారియర్స్ టీమ్ తో చెప్పాడు. 

16:57 PM (IST)  •  27 Feb 2022

అషుతో తేజస్వి గొడవ:

రేషన్ గురించి ఛాలెంజర్స్ పట్టించుకోవడం లేదని ముమైత్.. వారియర్స్ టీమ్ కి చెప్పడంతో అషు నేరుగా వెళ్లి శివను నిలదీసింది. దీంతో శివ.. మేనేజర్ ముమైత్ ఖాన్ ను ప్రశ్నించాడు. ఛాలెంజర్స్ అలా చెప్పలేదని.. మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నాడు. దీంతో ముమైత్ వెళ్లి  అషురెడ్డిని ప్రశ్నించింది. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అషు హర్ట్ అయింది కానీ అక్కడితో వదిలేసింది. కానీ తేజస్వి ఆ టాపిక్ ను ఎక్స్టెండ్ చేస్తూ.. 'ఇందాక నటరాజ్ మాస్టర్ తో పెరుగు తీసుకెళ్లి వాళ్ల(ఛాలెంజర్స్) మోహన కొడతానని సరదాగా డిస్కస్ చేస్తుంటే.. అషు కల్పించుకొని ఆ వర్డ్ వాడొద్దని చెప్పిందని' తేజస్వి తెలిపింది. తను ఎలా ఉండాలో కూడా ఆమె చెప్పేస్తుందని అనగా.. అషురెడ్డి తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తేజస్వి మాత్రం వినలేదు. కావాలనే నన్ను, నటరాజ్ మాస్టర్ ని తప్పుగా పోట్రే చేస్తుందంటూ మండిపడింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget