Bigg Boss 6 Telugu Episode 56: 'వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్' - డైరెక్ట్ ఎలిమినేషన్ తో హౌస్ మేట్స్ షాక్, బయటకు వచ్చిందెవరంటే?
శనివారం బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం!
వీకెండ్ వచ్చేసింది. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ కు టీవీలో చూపించారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 'మొన్న జరిగిన చేపల టాస్కులో నీ పార్టనర్ గీతూ ఫిజికల్ టాస్కు ఇవ్వండి గుద్ది పడేస్తా అంది, గుద్ది పడేసిందా' అని ఆదిరెడ్డిని అడిగారు నాగార్జున. గీతూకి సపోర్ట్ చేస్తూ 'ఆడింది సర్' అని చెప్పారు ఆదిరెడ్డి. దానికి నాగార్జున 'బాగా ఆడితే మీరే ఎందుకు లీస్ట్‌లో ఉన్నారు' అని అడిగారు. ఆదిరెడ్డి ఏదో వివరించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో సంచాలక్ గా గీతూ ఎలా ఆడిందని.. హౌస్ మేట్స్ ని అడిగారు నాగార్జున. దానికి అందరూ గీతూ సంచాలక్ గా న్యాయం చేయలేదని అని అన్నారు.
వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్:
'నువ్వు గెలవాలని కాదు, అవతలి వారి వీక్‌నెస్ మీద దెబ్బకొట్టాలని ట్రై చేశావ్' అని గీతూని అన్నారు నాగార్జున. దానికి గీతూ 'లాస్ట్ వీక్ పువ్వుల టాస్కు ఎవరు సరిగా ఆడలేదు సర్, నేనుండే సీజన్, వాళ్లు ఆడకపోయినా నేనే ఆడిపిద్దామని, అందరినీ కావాలనే రెచ్చగొట్టా' అని అన్నారు గీతూ. 'గేమ్‌ని ఇంట్రెస్ట్‌గా మార్చడం ఎలాగో బిగ్‌బాస్ చూసుకుంటాడు, ఎవరి ఆట వాళ్లు ఆడితే సీజన్ ఎక్కడో ఉంటుంది' అని అన్నారు నాగార్జున. దానికి గీతూ 'మెంటలైపోతుంది సర్ గేమంటే, బయట కూడా నేను గేమర్‌ని సర్' అన్నారు గీతూ.
నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది:
'ఒకరి వీక్‌నెస్ మీద ఆడడం గేమర్ కాదు' అన్నారు నాగ్. 'అసలు నువ్వెవరు ఆటలో ఇన్వాల్వ్ అవ్వడానికి, సంచాలక్ అంటే ఎంపైర్. నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. ఆ మాట బావుందా? బాగోలేదు కదా. కోపం వస్తే కామన్ సెన్స్, అన్నీ వెళ్లిపోతాయేమో' అని చాలా కోప్పడ్డారు నాగార్జున. 'గీతూ నీకు పనిష్మెంట్ తీసుకోవడానికి అర్హురాలివి' అన్నారు నాగార్జున. కెప్టెన్ శ్రీహాన్ ని ఏం పనిష్మెంట్ ఇద్దామని నాగార్జున అడిగారు. దాని శ్రీహాన్.. కిచెన్ లో గిన్నెలు క్లీన్ చేయిస్తానని చెప్పారు. తనకు ఓసీడీ ఉందని.. ఆ వర్క్ చేయలేనని చెప్పారు. ఫైనల్ గా బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒప్పుకున్నారు గీతూ.
ఆ తరువాత బాలాదిత్య, మెరీనాలతో మాట్లాడారు నాగార్జున. బాలాదిత్యను ఉద్దేశిస్తూ.. టాస్క్ లో అతడికి కోపమొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి బాలాదిత్య బాధేసిందని అన్నారు. 'సత్యతోనేనా గొడవ' అని నాగ్ అడగ్గా.. 'అవును సార్' అని బదులిచ్చారు బాలాదిత్య. దానికి వెంటనే సత్య.. 'సారీ చెప్పాను సార్' అని అన్నారు. 'గీతూ చెప్పమంటే చెప్పావ్' అని నాగ్ అన్నారు. వెంటనే సత్య 'నాకు ప్రామిస్ గా గుర్తు లేదు సార్' అని బదులిచ్చారు. 'అదే ఫుడ్ ఐటెం అయితే గుర్తుంటాది' అని నాగ్ కౌంటర్ ఇచ్చారు.
గేమ్ లో మెరీనాకి ఎన్ని మార్కులు ఇస్తావని బాలాదిత్యను అడగ్గా.. అతడు పదికి ఎనిమిది మార్కులు ఇచ్చారు. మెరీనా గేమ్ తీరుని నాగార్జున కూడా పొగిడారు. అలానే గేమ్ లో బాలాదిత్య హ్యూమన్ యాంగిల్ చూపించడం బాగుందని నాగార్జున ప్రశంసలు కురిపించారు.
గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది మీ గేమ్:
శ్రీహాన్, శ్రీసత్యలతో మాట్లాడుతూ.. 'మీరిద్దరూ కలిసి ఆడారా..? లేక మిగతా జంటల హెల్ప్ తీసుకొని ఆడారా..?' అని నాగ్ ప్రశ్నించారు. 'కలిసే ఆడాం సార్' అని చెప్పారు. 'మీకు ఎవరూ చేపలు ఇవ్వలేదా..?' అని నాగ్ ప్రశ్నించగా.. గీతూ పక్కన పడేసినవి తీసుకున్నట్లు చెప్పారు శ్రీసత్య. దానికి నాగ్ 'గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది మీ గేమ్' అని నాగ్ అన్నారు. శ్రీసత్యకి గేమ్ లో ఎన్ని మార్క్స్ ఇస్తావని శ్రీహాన్ ని అడగ్గా.. అతడు ఎనిమిది మార్కులు ఇచ్చారు. శ్రీహాన్ గేమ్ కి పది మార్కులు ఇచ్చారు శ్రీసత్య.
ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా:
రోహిత్, కీర్తి లు చాలా బాగా ఆడారని నాగార్జున పొగిడారు. వీరిద్దరూ ఒకరికొకరు పది మార్కులు ఇచ్చుకున్నారు. వసంతిని ఉద్దేశిస్తూ.. 'ఆ చిట్టీల ఆట ఏంటమ్మా..? ఎంతో ఫైట్ చేసి చేసి.. సింపుల్ గా ఇచ్చేశావ్' అని నాగ్ అనగా.. 'ఇక్కడ ముగ్గురు అమ్మాయిల కంటే నువ్ ఫిజికల్ గా తక్కువ టాస్క్ లు ఆడతావని అన్నప్పుడు(సూర్యని ఉద్దేశిస్తూ) ట్రిగ్గర్ అయిపోయి ఇచ్చేశానని' చెప్పారు. వెంటనే నాగ్ 'సూర్య నువ్ ఫెమినిస్ట్ అని చెప్పుకుంటావ్.. మరి ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా అవి' అని నాగ్ క్లాస్ పీకారు. గేమ్ లో సూర్యకి తొమ్మిది మార్కులు ఇచ్చారు వసంతి. సూర్య కూడా వసంతికి తొమ్మిది మార్కులు ఇచ్చారు.
కామెడీకి కూడా ఒక హద్దు ఉంటుంది:
రాజ్, ఫైమాలు బాగా ఆడారని పొగిడారు నాగార్జున. గేమ్ లో ఫైమా.. రాజ్ కి పది మార్కులు ఇవ్వగా.. ఆమెకి తొమ్మిది మార్కులు ఇచ్చారు రాజ్. ఆ తరువాత ఫైమాతో మాట్లాడుతూ.. 'కామెడీకి ఒక్కోసారి హద్దు ఉంటుందనేది మర్చిపోతున్నావ్.. కొందరి విషయంలో నువ్ నోరు జారుతున్నావ్.. జాగ్రత్తగా ఉండు' అని చెప్పారు నాగార్జున. కావాలని ఎవరిని ఏం అననని.. ఇకపై కేర్ ఫుల్ గా ఉంటానని చెప్పారు ఫైమా.
ఉన్మాదిలా ఆడుతున్నావ్:
ఆ తరువాత రేవంత్, ఇనయాలతో మాట్లాడారు నాగార్జున. ఇద్దరూ గేమ్ బాగా ఆడారని.. కానీ ఒక వీడియో చూపిస్తానని అన్నారు నాగార్జున. అందులో రేవంత్.. గీతూ, కీర్తిలను గేమ్ లో తోసేస్తూ కనిపించారు. కావాలని చేయలేదని రేవంత్ చెప్పగా.. 'ఇంటెన్షనల్ గా చేశావ్ అని నేను చెప్పడం లేదు.. కానీ అగ్రెషన్ కనిపిస్తుంది. ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నావ్' అని వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. ఇక గేమ్ లో రేవంత్ కి తొమ్మిది మార్కులు ఇచ్చారు ఇనయా. రేవంత్ మాత్రం ఇనయాకు పది మార్కులు ఇచ్చారు.
హౌస్ లో అనర్హులు ఎవరని భావిస్తున్నారో వారికి 'రాటెన్ ఫిష్' బ్యాడ్జ్ పెట్టాలని శ్రీహాన్ కి చెప్పారు నాగార్జున. పాజిటివ్స్ చెప్పినప్పుడు ఎలా తీసుకుంటామో.. నెగెటివ్స్ కూడా అలానే తీసుకోవాలి. కానీ కీర్తి మాత్రం నెగెటివ్ పాయింట్ ను మైండ్ లో పెట్టేసుకుంటుందని రీజన్ చెప్పి ఆమెకి బ్యాడ్జ్ చెప్పారు.
సూర్య ఎలిమినేషన్, హౌస్ మేట్స్ షాక్:
ఆ తరువాత ఈరోజు ఎపిసోడ్ లో డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి షాకిచ్చారు నాగార్జున. తన చేతిలో ఉన్న స్క్రోల్ లో ఎవరి పేరైతే ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లే అని చెప్పారు నాగార్జున. అందులో సూర్య పేరొచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇనయా అయితే సూర్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సూర్య ఎలిమినేషన్ ని ఎవరూ ఊహించలేదు. రేవంత్, శ్రీహాన్ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ సూర్యని సీక్రెట్ రూమ్ లో పెడతారని డిస్కస్ చేసుకున్నారు. ఇనయా అయితే ఏడుస్తూనే ఉంది.. సూర్యను హత్తుకొని ముద్దులు పెట్టి మరీ పంపించింది. ఆ తరువాత కూడా డోర్ దగ్గర కూర్చొని సూర్య సూర్య అని అరుస్తూనే ఉంది. ఫైమా, రాజ్, కీర్తి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సూర్య నిజంగానే ఎలిమినేట్ అయ్యారో లేక సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తున్నారో రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.
Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా