Bigg Boss 5 Telugu: కోతి, అరటి పండు, వేటగాడు, చెట్టు…బిగ్ బాస్ హౌస్ లో వెరైటీగా ఏడోవారం నామినేషన్ల ప్రక్రియ...ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..
ఆరు వారాలు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఏడోవారంలోకి అడుగుపెట్టింది. సోమవారం కావడంతో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెద్ద రచ్చే జరిగినట్టు తెలుస్తోంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరు వారాలు పూర్తి కావడంతో ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీద, శ్వేత ఐదుగురు ఫీమేల్ కంటిస్టెంట్స్ కాగా నటరాజ్ మాస్టర్ మాత్రమే ఎలిమినేట్ అయిన మేల్ కంటిస్టెంట్. ఇక ఏడోవారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందంటూ బిగ్ బాస్ ఎనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉంది..
Eesari nominations koncham variety ga plan chesaru...List lo evaru untaru?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/UXgujhuqXM
— starmaa (@StarMaa) October 18, 2021
ప్రోమోలో ఏముందంటే... ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని ప్రియాంక సింగ్ మండిపడింది. సన్నీ, శ్రీరామ్, జస్వంత్ వేటగాళ్లుగా కనిపిస్తున్నారు. వాళ్లు ఎవర్ని పట్టుకుంటే వారు...ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందన్నట్టు అర్థమవుతోంది. ఈ ప్రాసెస్ లో సన్నీ-రవి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. షణ్ముక్... ఆనీ మాస్టర్ ని, సిరి...మానస్ ని, కాజల్...ప్రియని నామినేట్ చేశారు. అయితే మనల్ని ఎవరు చేస్తారో ఐడియా ఉంది..మనం ఎవర్ని నామినేట్ చేయాలో క్లారిటీ ఉందని ప్రియ-యానీ మధ్య చర్చ జరిగింది. వాస్తవానికి తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని నామినేట్ అయినబోర్డు వేసుకున్న సిరి..కాజల్ తో అంది. తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని సిరి కాజల్ తో అంది. గార్డెన్ ఏరియాలో చెట్టుకి కొతి బొమ్మలు వేలాడ దీసి వాటికి ఇంటి సభ్యుల ఫొటోలు తగిలించారు. నామినేట్ చేసిన వారు ఆ ఫొటోలను కట్ చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: దసరా తర్వాత సరిగ్గా 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది .. బండ్ల గణేష్ ట్వీట్ లో ఏముంది..వాస్తవం ఏంటి..!
మొత్తానికి గడిచిన ఆరు వారాలతో పోల్చుకుంటే ఈ సారి నామినేషన్ ప్రక్రియ డిఫరెంట్ గానే సాగినట్టు తెలుస్తోంది.
Also Read: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగే...థియేటర్ల లోనూ సందడే సందడి
Also Read: నువ్వు ఇక్కడ లేకపోయినా భయం వేస్తోంది..సమంత పోస్ట్ వైరల్...
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్
Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి