By: ABP Desam | Updated at : 18 Oct 2021 11:26 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit/ Samantha Instagram
విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో సమంత పేరు మారుమోగిపోయింది. చైతూ పెద్దగా స్పందించకపోయినా సమంత మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. మొన్నటి వరకూ తనపై వచ్చిన రూమర్స్ పై రియాక్టైన సమంత...తాజాగా తన పనిలో తాను బిజీ అయిపోయింది. ఎప్పటిలా జిమ్ లో కసరత్తులు చేస్తూ పిక్స్ షేర్ చేసుకుంటోంది. మరోవైపు వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తోంది. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్లో సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. “స్నేహ దేషు.. నా మీద నీకు ఇంత ఆధీనం ఎలా వచ్చింది. నీవు ఇక్కడ లేకపోయినా కూడా భయం వేస్తోంది. ఎవరు చెప్పినా కూడా నేను 30 కిలోల డంబెల్ వైపు కన్నెత్తి చూడను. కానీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. ఆ డంబెల్ వైపు చూడండి. నాలో సగం బరువు ఉంటుంది” అంటూ తన డంబెల్ ఎత్తుతూ వర్కౌట్ చేస్తు్న్న విడీయో షేర్ చేసింది. స్నేహ దేషు.. సమంత జిమ్ ట్రైనర్.
సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. తాజాగా 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' నిర్మిస్తోన్న 30వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే తన తదుపరి ప్రాజెక్టులు, షూటింగ్స్ కి సంబంధించి సామ్ కొత్త నిబంధనలు పెడుతోందట. ఇంతకీ ఆమె కండిషన్స్ ఏంటంటే... తాను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్స్ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్స్ పెడుతోందట సామ్. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్ అయితే ఇండోర్ మాత్రమే ప్లాన్ చేయాలని..పబ్లిక్ లో షూటింగ్ అస్సలే వద్దని చెప్పేసిందట. తన కండీషన్స్‌కు ఓకే చెప్తేనే సినిమాలకు సైన్ చేస్తోందని లేదంటే లేదని టాక్. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేయడానికి కూడా సమంత పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇంకా కొంతకాలం చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...
'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' తెలుగు-తమిళంలో తెరకెక్కించే సినిమాకు సామ్ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. హరి, హరీశ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. మొత్తానికి సామ్ కండిషన్స్ చూస్తుంటే నయనతారని ఫాలో అవుతున్నట్టుందే అంటున్నారంతా. ఎందుకంటే నయనతార కూడా ఇచ్చినడేట్స్ కన్నా ఒక్కరోజు ఎక్కువ పనిచేయదు, ప్రమోషన్స్, ఆడియో ఫంక్షన్లకు పెద్దగా హాజరుకాదు. దీంతో సమంత కూడా ఒక్కో కండిషన్ పెడుతూ లేడీ సూపర్ స్టార్ ని ఫాలో అవుతోందే అంటున్నారు.
Also Read: బిగ్ బాస్ 5.. శ్వేత ఔట్.. గుక్కపెట్టి ఏడ్చిన ఆనీ.. కోతి, కత్తితో ఈ వారం నామినేషన్
Also Read: వాళ్ల రాజీనామాలు అందలేదు.. శ్రీవారి సన్నిధిలో మంచు విష్ణు సంచలన కామెంట్స్..
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
Also Read: ప్రోమోలో బాలకృష్ణ గుర్రపు స్వారి?.. ఈ పిక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
F3 Movie Ticket Prices: టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు - క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్