అన్వేషించండి

Unstoppable.. ప్రోమోలో బాలకృష్ణ గుర్రపు స్వారి?.. ఈ పిక్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే!

బాలకృష్ణ టాక్ షో.. ప్రోమో వచ్చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది.

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే అభిమానుల్లో తెలియకుండానే ఉత్సాహం ఉరకలెత్తుంది. ఆయన డైలాగులు చెబుతుంటే.. ముసలోడు సైతం లేచి విజిల్ వేయాల్సిందే. మరి, అంత క్రేజ్ ఉన్న బాలయ్య.. ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అంటూ వచ్చేస్తున్నారు. ‘ఆహా’లో టెలికాస్ట్ కానున్న టాక్ షోలో బాలయ్య తన విశ్వరూపం చూపిస్తారని, ఆయనలోని మరోకోణాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ఈ షో కోసం నిర్మాతలు భారీ పారితోషికాన్ని ముట్టజెప్పనున్నట్లు సమాచారం.  

ఇప్పటికీ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బుల్లి తెరపై తమ లక్ పరీక్షించుకున్నారు. రియాలిటీ షోలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా వీరి సరసన బాలయ్య కూడా చేరుతున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవథులే లేవు. ఇందులో బాలయ్య ‘సింహా’ సినిమా గెటప్‌లో కనిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ షోకు సంబంధించిన ప్రోమో ఏదీ రిలీజ్ కాలేదు. కేవలం స్నీక్-పీక్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఆహా’ త్వరలో ప్రోమోను సిద్ధం చేస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బాలయ్యతో ఉన్న ఓ ఫొటోను ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘ఆయన ఆయన సాటిలేని వ్యక్తి.. ఆయన్ని ఎవరూ ఆపలేం(Unstoppable).. జై బాలయ్య’’ అని ట్వీట్ చేశారు. చూస్తుంటే.. ఈ ప్రోమో దుమ్మురేపేలా ఉంది. వెనుక ఒక తెల్ల గుర్రం కూడా ఉంది. 

ఈ షో ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటి వరకు బాలయ్యతో ఒక్క సినిమా కూడా నిర్మించని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ టాక్‌ షో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.40 లక్షలు చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ షోలో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయని, అంటే సుమారు రూ.5 కోట్లు వరకు బాలయ్యకు దక్కనుందని తెలిసింది. బాలకృష్ణ ఇప్పటివరకు సినిమాలకు కూడా అంత భారీ పారితోషకం తీసుకోలేదు. దీన్ని బట్టి బాలయ్యకు ఈ టాక్ షో మంచి క్రేజ్‌తోపాటు క్యాష్ కూడా లభించనుంది. నవంబ‌ర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్నది  ఆస‌క్తిగా ఉంది. ఈ మధ్యే ఈ షో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్‌ కలసి పాల్గొంటారని, ఆరంభ ఎపిసోడ్‌లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పాల్గొటారని సమాచారం. మిగతా ఎపిసోడ్స్‌లో నాగార్జున, చైతూ, అఖిల్ కలసి రానున్నట్లు తెలిసింది. అందుకే.. ఈ షోను ‘బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్’ అని పేర్కొంటున్నారు. 

Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

Also Read: బిగ్ బాస్-5.. తల్లి సేఫ్.. కూతురు ఔట్.. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆమే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
Brahmamudi Serial Today August 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget