Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Podarillu Serial Today Episode August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?

Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. తల్లిదండ్రులు టార్చర్ పెడుతున్నారని శైలు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా...వాళ్లు వచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఇదే విషయం కేశవ్ ఇంట్లో వాళ్లకు చెబుతాడు. ఆ తర్వాత మాధవ్‌కు పెళ్లి చేయడం లేదని ఇంట్లో అందరిపైనా మహా అరవడంతో కేశవ్, చక్రి ఇద్దరూ పెళ్లిళ్ల బ్రోకర్ దగ్గరకు వెళ్లి మాట్లాడతారు.
తల్లిదండ్రులకు శైలు షాక్
శైలు వాళ్ల ఇంటికి లేడీ ఎస్‌ఐ కానిస్టేబుళ్లతో సహా రావడంతో సురేశ్, శివశంకర్,వరాలు షాక్ తింటారు.ఎందుకొచ్చారని అడగ్గా....శైలు మీ అమ్మాయేనా అని ప్రశ్నిస్తారు.ఇంతలో శైలు లోపలి నుంచి వస్తుంది.వీళ్లేనా నిన్ను టార్చర్ పెడుతుందని అడుగుతుంది ఎస్‌ఐ. మీరు మీ అమ్మాయిని కొట్టి హింసిస్తున్నారని మాకు ఫోన్ చేసి చెప్పిందని చెబుతుంది. ఎందుకు కొడుతున్నారని అడగ్గా...నేను ఓ అబ్బాయిని ప్రేమించానని అందుకే మా అమ్మ, అన్నయ్య కలిసి రోజూ కొట్టి, తిట్టి హింసిస్తున్నారని శైలు చెబుతుంది. దీంతో ఎస్‌ఐ సురేశ్‌కు, వరాలు వార్నింగ్ ఇచ్చి వాళ్లతో లెటర్ రాయించుకుంటుంది. మరోసారి శైలును ఇంట్లో ఇబ్బందిపెట్టారని తెలిస్తే డైరెక్ట్‌గా లోపల వేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. పోలీసులు వెళ్లిన తర్వాత సురేశ్ తోకజాడించాలని చూడగా....ఒక్క ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా రిమాండ్‌లో ఉంటావని శైలు బెదిరిస్తుంది. తల్లి అన్నం పెట్టనని చెప్పగా....పోన్ చేయమంటావా అని బెదిరిస్తుంది.ఇప్పటికే ఇంటిపరువు పోయిందని...మీరు దాన్ని ఏమీ అనొద్దని శంకర్ ఇంట్లోవాళ్లకు చెబుతాడు. ఇదే విషయం వెళ్లి కేశవ్‌కు శైలు చెబుతుంది.
నోరు జారిన చక్రి
ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండగా...మహా కేశవ్‌ను అడుగుతుంది. శైలు వాళ్ల ఇంట్లో పరిస్థితి ఏలా ఉందో కనుక్కున్నావా అని అంటుంది. శైలు వాళ్ల అమ్మావాళ్లపైనే కేసుపెట్టిందని....పోలీసులు వచ్చి వాళ్ల అమ్మ, అన్నకు గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లారని చెప్పి నవ్వుతాడు. కాబట్టి ఇక భయం లేదని అంటాడు. అందరూ నవ్వుకున్నా మాధవ్ మాత్రం బాధపడతాడు. ఎందుకు పెద్ది అలా ఉన్నావని అంటే...పాపం చిన్నప్పటి నుంచి కని ప్రేమగా పెంచిన వాళ్లపైనే కేసుపెట్టడం ఏంటమ్మా అని అంటాడు. వాళ్లు చేసింది కూడా తప్పేకదా అని మహాలక్ష్మీ అంటుంది. లేకపోతే రోజూ కొట్టడం ఏంటని అంటుంది. ఏదీ ఏమైనా మహా వాళ్ల అమ్మానాన్నే నయమని...నన్ను కొట్టారు తప్ప మహాపై ఒక్క దెబ్బ కూడా వేయలేదని అంటాడు.దీంతో అసలు నాకు ఎందుకు ఈ ఐడియా రాలేదని మహా అంటుంది.పోలీసులను నేను ఎందుకు ఆశ్రయించలేదని అంటుంది. నువ్వు పోలీసుల దగ్గరకు వెళ్లినా...మీ నాన్న వాళ్లను ప్రలోభపెట్టేవాడని చక్రి అంటాడు. అంతలా ప్రలోభపెట్టేవాడే అయితే మీ పెళ్లి కూడా జరగకుండా ఆపేవాడు కదరా అంటాడు. ఇంతలో మహాలక్ష్మీ కేశవ్‌తో నిన్ను నమ్మి ఓ అమ్మాయి ఇంటికి వచ్చిందని తనను మాత్రం వదిలిపెట్టొద్దని అంటుంది.నేను కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేపెట్టేది లేదని చక్రి నోరుజారగా...అందరూ కోపంగా చూస్తారు. దీంతో చక్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శివాలెత్తిన శివంగి
తెల్లారిన తర్వాత ఇంటి ముందు కూర్చుని గోళ్లు తీసుకుంటున్న నారాయణపై మహాలక్ష్మీ మండిపడుతుంది. ఇన్ని ఏళ్లు వచ్చినా నీకు బుద్ధిరాలేదని తిడుతుంది. పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా దేవుడు నీకు పెట్టలేదని గట్టిగా క్లాస్ పీకి ఇంట్లోకి వెళ్లేసరికి చక్రి,కేశవ్, కన్నా ఫోన్‌లో మునిగిపోయి ఉంటారు.ఇక అంతే అందరినీ ఓ దులుపు దులిపివదులుతుంది. దీంతో చక్రి, కేశవ్ బయటకు పారిపోతారు.అక్కడ మాధవ్ అమ్మలక్కలతో కలిసి కూరగాయలు కొంటుంటే చూసి తిట్టి తీసుకుని వస్తారు.నీకు అసలే పెళ్లికావడం లేదని మేం బాధపడుతుంటే...నువ్వు ఇలా అమ్మలక్కలతో కలిసి కూరగాయలు కొని, పచ్చళ్లు ఎలా పెట్టాలి, చట్నీలు ఎలా చేయాలో నేర్చుకుంటుంటే నీకు పిల్లను ఎవరిస్తారని తిట్టి తీసుకొస్తారు. ఆ తర్వాత బ్రోకర్‌ను కలిసి మాధవ్‌కి పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















