Bigg Boss 5 Elemination: బిగ్ బాస్-5.. తల్లి సేఫ్.. కూతురు ఔట్.. ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆమే!
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? తల్లీకూతుళ్లను బిగ్ బాస్ విడదీయనున్నాడు.
‘బిగ్ బాస్-5’.. శనివారం హోస్ట్ నాగార్జున వార్నింగ్‌తో వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఫన్‌డే కావడంతో.. ఈ రోజు సరదా సరదాగా సాగిపోనుంది. అయితే, ఈ రోజు యానీ మాస్టార్‌కు మాత్రం ఫన్ డే కాకపోవచ్చు. శనివారం నాటకీయ పరిణామాల మధ్య లోబో హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం.. అతడిని నాగార్జున సీక్రెట్ రూమ్‌కు పంపించడం.. ఇది తెలియక ఇంట్లోవారు తెగ ఫీలైపోవడం జరిగిపోయింది. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనుంది. ఈ రోజు అసలైన ఎలిమినేషన్ జరగనుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ తల్లీ-కూతుళ్లను విడదీయనున్నాడు. ఇప్పటికే మీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది.
‘బిగ్ బాస్ -5’ హౌస్‌లో అడుగుపెట్టిన రోజు నుంచి తల్లీ-కూతుళ్లుగా ప్రేమను వలకబోస్తున్న యానీ మాస్టర్, శ్వేత వర్మలకు ఇటీవల బిగ్ బాస్ గొడవలు పెట్టాడు. బొమ్మల టాస్క్‌లో యానీ మాస్టర్, శ్వేత మధ్య పెద్ద వారే జరిగింది. గత టాస్క్‌లో ఫ్రెండ్ పోయాడు, ఈ సారి బిడ్డ పోయిందంటూ యానీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం జరిగే ఎలిమినేషన్‌లో శ్వేత.. తన ఇంటికి వెళ్లేందుకు బట్టలు సర్దేసుకోనున్నట్లు తెలిసింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందనేది పక్కా సమాచారం.
ఆదివారం ఎపిసోడ్ ప్రోమో:
సీక్రెట్ రూమ్‌లో లోబో ఎంజాయ్: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కన్ఫెషన్ రూమ్‌లో సభ్యులు ఎవరెవరికి ఇంట్లో ఉండే అర్హతలేదో చెప్పారు. ఈ సందర్భంగా ప్రియకి నాలుగు ఓట్లు, లోబోకి నాలుగు ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరిలో ఎవర్ని హౌస్‌లో ఉంచాలన్నది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని నాగార్జున సూచించారు. ఈ మేరకు కేవలం నలుగురు మాత్రమే లోబోకు మద్దతివ్వడంతో ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చిన లోబో హౌస్ మేట్స్ అందరూ మంచోళ్లే అని చెప్పాడు. ఇంట్లో నేను నా లెక్కనే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. బై.. గుడ్ నైట్ చెప్పేయడంతో స్టేజ్ నుంచి వెళ్లిపోతున్న లోబోని వెనక్కి పిలిచి నాగ్ షాకిచ్చారు. కేవలం ఆడియన్స్ ఓట్ల ద్వారా మాత్రమే ఎలిమినేట్ అవుతారని చెబుతూ లోబోని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. మళ్లీ బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుందన్న మాట.
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: సత్యదేవ్ కొత్త సినిమా గాడ్సే... లుక్ అదిరిందిగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి