By: ABP Desam | Published : 20 Oct 2021 12:51 PM (IST)|Updated : 20 Oct 2021 12:59 PM (IST)
Image Credit: Star Maa/Hotstar
‘బిగ్ బాస్ -5’లో ఈ వారం వీజే సన్నీ, ప్రియా.. హోస్ట్ నాగార్జునకు పెద్ద పనే చెప్పలా ఉన్నారు. ‘బిగ్ బాస్’ ఇచ్చిన గుడ్డు టాస్కులో వీరు మాటల తూటాలు పేల్చుకున్నారు. చివరికి నువ్వా-నేనా అన్నట్లు పొట్లాడుకున్నారు. బుధవారం ఉదయం విడుదల చేసిన ప్రోమోలో.. వీరి గొడవే హైలెట్. మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లోనే వీరి మధ్య అగ్గిరాజుకుంది. చూస్తుంటే.. సన్నీని ప్రియా టార్గెట్ చేసుకుని మరీ ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
‘బంగారు కోడిపెట్ట’ టాస్కులో భాగంగా ఏ ఇంటి సభ్యులు ఎక్కువ కోడిగుడ్లు సొంతం చేసుకుంటారో వారికి కెప్టెన్సీ టాస్కులో పోటీచేసే అవకాశం లభిస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. ఎవరి గుడ్లు.. వాళ్లు జాగ్రత్త చేసుకోవాలని బిగ్ బాస్ పేర్కొన్నాడు. మొదటి కోడి కూత రాగానే గుడ్లు కోసం ఇంటి సభ్యులు పోటీ పడ్డారు. తాను అందరి గుడ్లు జోలికి వస్తానని ప్రియ.. పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పి హౌస్‌మేట్స్‌ను సరదాగా హెచ్చరించింది. వ్యక్తిగత టాస్క్ అని చెప్పినప్పటికీ ఇద్దరిద్దరు చొప్పున గ్రూప్స్‌గా విడిపోయారు. ఈ సందర్భంగా సన్నీ-ప్రియ మధ్య కాసేపు వాదన జరిగింది. అది బుధవారం ఎపిసోడ్‌లో ముదిరి పాకాన్న పడింది.
బుధవారం విడుదలైన ప్రోమో ప్రకారం.. ‘బంగారు కోడిపెట్ట’ గుడ్లు పెడుతున్న సమయంలో మౌస్‌మేట్స్ అంతా వాటిని కలెక్ట్ చేసుకోడానికి పరుగులు పెట్టారు. అంతా గుడ్లు సేకరించే పనిలో ఉండగా.. ప్రియా ‘‘నాకు బుట్ట దొరికింది..’’ అంటూ సన్నీ దాచుకున్న గుడ్ల సంచిని చింపేందుకు ప్రయత్నించింది. దీంతో సన్నీ ఆమెను అడ్డుకోవడం కోసం పక్కకు తోశాడు. ‘‘పిజికలైతే మర్యాదగా ఉండదు. చెంప పగిలిపోద్ది’’ అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. దీంతో సన్నీ.. ‘‘నోరు ఉందని పారేసుకోకు’’ అని గట్టిగా అరిచాడు. ‘‘ఇక్కడికి వచ్చి అన్నీ చింపేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా?’’ అని అడిగాడు. దీంతో ప్రియా సన్నీ గుడ్ల సంచిని తీసుకుని చింపేసింది. ‘‘నా గేమ్ ఇదే. మీరు దొంగతనం చేస్తే దొంగతనం కాదు. కష్టపడి ఆడినట్లు. అర్ధరాత్రి వచ్చి దొంగతనం చేస్తే’’ అని ప్రియా అనడంతో సన్నీ.. ‘‘ఏయో’’ అని అరిచాడు. దీంతో ప్రియా మరింత కోపంతో.. ‘‘ఏయ్ ఏంటీ ఏయ్..’’ అంది. ‘‘ఆట చేతకాదు.. చేతకాని ముఖాలు వస్తారు ఇక్కడికి’’ అని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ప్రియా స్పందిస్తూ.. ‘‘పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది చెబుతున్నా..’’ అని మరోసారి సన్నీని హెచ్చరించింది. దీంతో సన్నీ.. ‘‘దమ్ముంటే కొట్టి చూడు’’ అని ప్రియా మీదకు వెళ్లాడు. ‘‘నన్ను టచ్ చేసి చూడు’’ అని ప్రియాంక.. సన్నీని మరింత రెచ్చగొట్టింది. చూస్తుంటే.. ఈ రోజు బిగ్ బాస్‌కు కావలసిన కంటెంట్ దొరికిందేమో అనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూసే అవకాశాలు బాగానే ఉన్నాయి.
Also Read: సన్నీ-ప్రియ మధ్య మరింత అగ్గి రాజేసిన 'బంగారు కోడిపెట్ట'
‘బిగ్ బాస్ 5’ ప్రోమో:
Also Read: 'మా'లో అంతా జోకర్లే.. ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ స్ట్రాంగ్ రిప్లై
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?
KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్