Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా
'బిగ్ బాస్' బ్యూటీ, ప్రముఖ యూట్యూబర్ సిరి హనుమంతు కరోనా బారిన పడ్డారు.
కరోనా మూడో దశలో మహమ్మారి బారిన పడిన బుల్లితెర తరాల జాబితాలో 'బిగ్ బాస్ 5' ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ సిరి హనుమంతు చేరారు. ఆమెకు కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సిరి స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే... తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని రాసుకొచ్చారు. దీన్ని బట్టి త్వరలో కోలుకుంటారని ఆశించవచ్చు.
కరోనా మూడో దశలో రోజుకు ఒక సెలబ్రిటీ కొవిడ్ బారిన పడుతున్నారు. మంగళవారం సిరి కరోనా బారిన పడితే... సోమవారం హీరోయిన్ డింపుల్ హయతి తనకు కరోనా అని ప్రకటించారు. దానికి రెండు రోజుల ముందు కమెడియన్ విద్యుల్లేఖా రామన్ కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, లక్ష్మీ మంచు, త్రిష, మంచు మనోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కరోనా నుంచి కోలుకున్నారు. కీర్తీ సురేష్ కరోనా నుంచి కోలుకోవాల్సి ఉంది.
View this post on Instagram
Also Read: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
Also Read: రాజస్తాన్‌లో 'బంగార్రాజు'... ఇది నాగార్జునకు పెద్ద సర్‌ప్రైజ్!
Also Read: ఏజ్ షేమింగ్ ఏంటి? నన్ను అలా పిలవద్దు! - స్ట్రాంగ్‌గా చెప్పిన అనసూయ
Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి