అన్వేషించండి

IndiGo Flights-BCCI: ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?

IndiGo Flights-BCCI:భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 1000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. ఇప్పుడు ఈ సంక్షోభంతో బీసీసీఐ తలలు పట్టుకుంటోంది.

BCCI shifts SMAT Knockout Matches to Pune: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని ప్రతి విమానాశ్రయంలో ప్రయాణికుల ఆగ్రహం కనిపిస్తోంది. ఈ సంక్షోభంలోకి ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా చిక్కుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఇండోర్‌లో ఆడాల్సి ఉంది. అయితే ఇండిగో విమానయాన సంక్షోభం,  ప్రయాణ సమస్యల కారణంగా, BCCI మొత్తం వేదికను మార్చడానికి కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌లు ఇప్పుడు పూర్తిగా పూణేకు మార్చారు.

ఇండోర్ నుంచి పూణేకు మార్చిన మ్యాచ్‌లు...

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చివరి 12 మ్యాచ్‌లు, సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఇండోర్‌లో జరగాల్సి ఉంది. కానీ ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణ వ్యవస్థ దెబ్బతింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) CEO రోహిత్ పండిట్ ఈ పరిస్థితిని BCCIకి ముందే తెలియజేశారు. ఆ తర్వాత BCCI అన్ని స్మాట్‌ మ్యాచ్‌లను పూణేకు మార్చాలని నిర్ణయించింది.

ఇప్పుడు పూణేలోని రెండు మైదానాల్లో మ్యాచ్‌లు

పూణేలోని MCA స్టేడియం, DY పాటిల్ అకాడమీలో SMAT నాకౌట్‌  మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ మార్పు కారణంగా జట్లు, సహాయక సిబ్బంది. అధికారులకు కొత్త ప్రయాణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వేదిక లభ్యత, ప్రయాణంలో తక్కువ అడ్డంకులు ఉన్నందున పూణే అత్యంత అనుకూలమైన ఎంపికగా మారింది.

BCCIకి పెద్ద పరీక్ష

వేదిక మారిన తర్వాత BCCI అనేక లాజిస్టిక్ సమస్యలను ఎదుర్కొంటోంది. అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ వంటి నాలుగు గ్రూప్-స్టేజ్ నగరాల నుంచి ఆటగాళ్ళు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పూణేకు తీసుకురావాలి. అదే సమయంలో, దేశంలో ఇతర దేశీయ పోటీలు కూడా జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 టీ20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బిహార్ ట్రోఫీ. ఈ పోటీల కోసం జట్లు, అధికారుల నిరంతర ప్రయాణం అవసరం. ఇండిగో సంక్షోభం కొనసాగితే, ఎనిమిది జట్లతోపాటు అంపైర్లు, అధికారులను సకాలంలో పూణేకు చేర్చడం BCCIకి ఒక పెద్ద సవాలుగా మారుతుంది.

సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రయత్నం

ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటైన BCCI ఈ ప్రయాణ సంక్షోభాన్ని ఎలా నిర్వహిస్తుందో ఇప్పుడు అందరి దృష్టి. చాలా తక్కువ సమయంలో అన్ని జట్లను సురక్షితంగా, సులభంగా , ప్రణాళికాబద్ధంగా పూణేకు తరలించడం బోర్డుకు పెద్ద పరీక్షగా ఉంటుంది. రాబోయే కొన్ని రోజులు భారతీయ దేశీయ క్రికెట్‌కు అతిపెద్ద పరీక్షగా మారవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget