News
News
X

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయినట్లు ప్రకటించారు.

FOLLOW US: 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్యర్య విడిపోయారు. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీరిద్దరికీ 2004లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌కు అన్నయ్య.

వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం సంచలనంగా మారిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అప్పటినుంచే వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.

ఐశ్వర్య రజనీకాంత్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. వీటిలో మొదటి సినిమా ధనుష్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘3’. పదేళ్ల క్రితమే యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ సాంగ్ ఈ సినిమాలోదే. ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ హీరోగా ‘వాయ్ రాజా వాయ్’ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించాడు. ధనుష్ మాత్రమే కాకుండా ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడిపోయిన విషయాన్ని ధ్రువీకరించింది.

Also Read: ధనుష్, ఐశ్వర్య ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఆమేనా?

నాగ చైతన్య, సమంతల తరహాలోనే వీరు కూడా ఒకే లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘18 సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసున్నాం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, సర్దుకుపోతూ, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ప్రయాణించాం. మా ఇద్దరి దారులు నేడు వేరవబోతున్నాయి. మేం ఒక భార్యాభర్తలుగా విడిపోయి.. వ్యక్తులుగా ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీని ఇవ్వండి.’ అని ఈ లేఖలో పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉన్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రజనీకాంత్ నటించిన పేట సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఇలమై తిరుంబదే’ పాటను ధనుష్.. ఐశ్వర్య కోసం స్వయంగా పాడటం ఈ వీడియోలో చూడవచ్చు.

View this post on Instagram
 
A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)

Published at : 17 Jan 2022 11:15 PM (IST) Tags: dhanush Dhanush Aishwarya Seperated Aishwarya Rajnikanth Dhanush and Aishwarya Dhanush Divorce

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!