Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం
Shivaraj Kumar As Gummadi Narasaiah: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా గమ్మడి నరసయ్య బయోపిక్ ప్రారంభమయింది. ఇందు కోసం శివరాజ్ కుమార్ ఇల్లెందు వచ్చారు.

Shivaraj Kumar As Gummadi Narasaiah in biopic: వామపక్ష ఉద్యమ చరిత్రలో ఒక జీవించే అధ్యాయం – మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ ను శుక్రవారం పాల్వంచలో ప్రారంభించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నర్సయ్య పాత్రలో నటిస్తున్నారు.
స్వయంగా శివరాజ్‌కుమార్ ఇల్లెందుకు వచ్చి నర్సయ్యను కలిశారు. ఇలాంటి మహానుభావుడిని బెంగళూరు పిలుచుకోవడం కన్నా, నేనే వచ్చి కలవడమే గౌరవం అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. నర్సయ్య జీవితం గురించి తెలుసుకున్నాకే తాను ఈ పాత్రకు యస్ చెప్పినట్లుగా తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక, మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 6, 2025
వారి చరిత్ర మన తెలంగాణ… pic.twitter.com/6bCPFunCxA
తెలంగాణ వామపక్ష ఉద్యమంలో గుమ్మడి నర్సయ్య ది ప్రత్యేక అధ్యాయం. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 1983 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 25 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా ఒక్క పైసా కూడా వ్యక్తిగతంగా సంపాదించుకోలేదు. ఎమ్మెల్యే జీతం మొత్తం పార్టీకి ఇచ్చేశారు. ఇప్పుడు వస్తున్న పెన్షన్‌లో కొంత భాగం మాత్రమే తన అవసరాలకు ఉంచుకుని మిగతా డబ్బు కూడా పార్టీకి అందజేస్తున్నారు.
శివరాజ్ కుమార్ గారి తల్లి గారైన పార్వతమ్మ గారి జన్మదినమైనా, ఈ కార్యక్రమం పాల్వంచ లో జరుపుడం అంటే ఇక్కడే మన మధ్యనే ఆమె జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గుమ్మడి నర్సయ్య గారు రియల్ హీరో అయితే శివరాజ్ కుమార్ గారు రీల్ తో పాటు రియల్ హీరో. ఆయన గొప్ప మానవతావాది.
— Sai Satish (@PROSaiSatish) December 6, 2025
Producer #NSureshReddy… pic.twitter.com/8VeZQaXE0D
ఆయన ఇల్లు ఇప్పటికీ అదే పాత గుడిసె. లగ్జరీ కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు లేవు. ఒక్క బైక్ కూడా లేదు. పార్టీ కార్యకర్తలు వచ్చినప్పుడు తనే ఆటోలో పిలిచి వెళ్తారు. రాజీకాయుల డబ్బు మయం అయిన తర్వాత ఎన్నికల్లో నర్సయ్య వెనుకబడ్డారు. కానీ తన సిద్ధాంతాలను, జీవనశైలిని ఒక్క రోజు కూడా మార్చుకోలేదు. ఇప్పటి రాజకీయ నాయకులు గుమ్మడి నర్సయ్య జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. డబ్బు, అధికారం కోసం కాదు, ప్రజల కోసం రాజకీయాలు చేయాలని ఈ చిత్రం చాటాలి అని కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.
ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గుమ్మడి నర్సయ్యను కారేపల్లి మండలంలోని టేకులగూడెంలో.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు శుక్రవారం కలిశారు. నర్సయ్య రాజకీయ జీవితచరిత్రపై నిర్మిస్తున్న బయోపిక్‌లో శివరాజ్‌కుమార్ నటించనుండగా శనివారం… pic.twitter.com/u41vg2YXMF
— ABP Desam (@ABPDesam) December 6, 2025





















