Bhool Bhulaiyaa 2 Trailer: 'భూల్ భులైయా2' ట్రైలర్ - సేమ్ రొటీన్ హార్రర్ ఫార్ములా
'భూల్ భులైయా2' సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

2007లో దర్శకుడు ప్రియదర్శన్ 'భూల్ భులైయా' అనే సినిమాను రూపొందించారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా పేరుతో 'భూల్ భులైయా2' రాబోతుంది. తొలి చిత్రంలో కీలకపాత్ర పోషించిన రాజ్ పాల్ యాదవ్ ఈ సినిమాలో కూడా నటించారు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
దర్శకుడు అనీష్ బాజ్మీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుంచి కొన్ని పోస్టర్లను, వీడియోలను రిలీజ్ చేసింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పదిహేనేళ్ల తరువాత మంజులికా అనే ఆత్మ హవేలీ నుంచి బయటకు వస్తే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనేది ఈ సినిమా కథ.
చిన్నప్పటి నుంచి ఆత్మల మధ్య పెరిగానని గొప్పలు చెప్పే హీరో మాంత్రికుడిగా అందరినీ మోసం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఆత్మలు కళ్లముందు కనిపిస్తే ఏం జరుగుతుందనేది ఫన్నీగా చూపించారు. అయితే ట్రైలర్ ను చూస్తుంటే సినిమాలో కొత్తగా ఏదీ కనిపించడం లేదు. రెగ్యులర్ హార్రర్ సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా రూపొందించారనిపిస్తుంది. కామెడీ గనుక వర్కవుట్ అయితే సినిమా హిట్ అవ్వడం ఖాయం!
Also Read: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?
Also Read: 'జబర్దస్త్'కు జడ్జ్ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























