Bhemla Nayak Update: భీమ్లానాయక్‌కి దీటుగా డానియల్ లుక్.. కానీ, ఊరించి తుస్సుమనిపించారు
'భీమ్లానాయక్ ' నుంచి రానా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సెట్స్ మీదున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘భీమ్లానాయక్’ ఒకటి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ సాంగ్ కి ఏ రేంజ్ లో స్పందన వచ్చిందో చూశాం. తాజాగా రానా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే, శుక్రవారం 4.05 గంటలకు అప్‌డేట్ ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. తెల్ల లుంగిలో వెనక్కి తిరిగి నిలుచున్న రానా చిత్రాన్ని పోస్ట్ చేశారు. బ్లిజ్ ఆఫ్ డానియల్ శేఖర్‌ను చూసేందుకు ఈ నెల 20 వరకు వేచి చూడాలంటూ తుస్ అనిపించారు.
నిన్నటి వరకూ భీమ్లానాయక్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే అన్నట్టు చేస్తున్నారు కానీ రానాకి సంబంధించి ఏ అప్ డేట్ ఇవ్వలేదనే విమర్శలొచ్చాయి. దగ్గుపాటి అభిమానులు ఈ విషయంపై హర్ట్ అయ్యారు కూడా. దీంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల 5 నిముషాలకు రానాకి సంబంధించిన అప్ డేట్ ఇస్తామంటూ ఉదయాన్నే హింటిచ్చారు మేకర్స్. పవర్ తుపాన్ చూశారు..ఇప్పుడు గెట్ రెడీ ఫర్.. అంటూ సితార ఎంటర్ టైన్మెంట్ ట్వీట్ చేసింది. కానీ, సింపుల్‌గా ఈ ఫోస్టర్ ట్వీట్ చేసి దగ్గుబాటి అభిమానులను నిరాశకు గురిచేశారు. దీంతో రానా ఫస్ట్ గ్లింప్స్ కోసం మరో మూడు రోజులు వేచిచూడక తప్పదు. కరోనా కారణంగా వాయిదాపడిన షూటింగ్ ఈ మధ్యే జోరందుకుంది. మొదట ‘భీమ్లా నాయక్’ టైటిల్ ప్రకటించి ఫ్యాన్స్‌లో ఊపుతెప్పించారు. ఆ తర్వాత టైటిల్ సాంగ్ విడుదల చేసి అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. రానా ఫస్ట్ గ్లింప్స్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంతా ఊహించారు. మలయాళంలో రెండు పాత్రలు నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటాయి. అందుకే.. రానా లుక్ ఎలా ఉంటుందో చూడాలనే ఆశక్తి అభిమానుల్లో నెలకొంది. ‘భీమ్లానాయక్’ను సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.
Also Read: డ్రగ్స్ కేసులో ఈరోజు తనీశ్ వంతు…ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైన హీరో
Also Read: జోరుమీదున్న’సర్కారువారి పాట’, కీర్తి సురేష్ తో స్పెయిన్ కి ఎగిరిపోనున్న మహేశ్ బాబు
Also Read: మోదీకి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు