PM Modi Birthday: మోదీకి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు
సెప్టెంబర్ 17తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీస్ ట్వీట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతాపార్టీ నాయకులు పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సినీ సెలబ్రెటీల నుంచి కూడా మోదీకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
చిరంజీవి
Happy Birthday Hon’ble Prime Minister Shri @narendramodi ji. May you be blessed with health and strength to serve the people of our country for a long long time!
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 17, 2021
గౌరవనీయులైన ప్రధాన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..మన దేశ ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలందించడానికి మీరు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మహేశ్ బాబు
Wishing our hon'ble PM Shri @narendramodi ji a very happy birthday. May the nation continue to prosper under your able leadership. Good health and happiness always.
— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2021
ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటున్నాం.ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు.
నాగార్జున
Many happy returns of the day to our honourable PM Shri @narendramodi ji !! May you lead India 🇮🇳 to the heights of prosperity under your leadership!!🙏Health and happiness to you sir!! #HappyBdayModiji
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 17, 2021
మీ నాయకత్వంలో దేశాన్ని ఉన్నత స్థాయికి నడిపించండి. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మీకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు నాగార్జున.
రవితేజ
Wishing honourable PM @narendramodi Ji a very happy birthday. Great health and happiness always 🙏
— Ravi Teja (@RaviTeja_offl) September 17, 2021
ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటూ బర్త్ డే విశెష్ చెప్పాడు మాస్ మహారాజ్ రవితేజ
మోహన్ బాబు
Dear Modi Ji @narendramodi ,💐
— Mohan Babu M (@themohanbabu) September 17, 2021
Your wealth of experience has impacted us positively in so many ways. I wish you a long life, good health, and prosperity.
Happy Birthday to our Hon'ble Prime Minister on his 71st birthday.#HappyBirthdayModiji pic.twitter.com/Hq2yK1bMBO
మీ అనుభవ సంపద ఎన్నో విధాలుగా మాపై సానుకూల ప్రభావాన్ని చూపింది. మీకు దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మోహన్ బాబు.
అభిషేక్ బచ్చన్
A very happy birthday to our Honourable Prime Minster, Shri @narendramodi Ji. Wishing you a long and healthy life ahead.
— Abhishek Bachchan (@juniorbachchan) September 17, 2021
మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అభిషేక్ బచ్చన్ మీరు ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశాడు.
Also Read: బర్త్ డే స్పెషల్... ప్రధాని మోదీ తలపాగాల ప్రత్యేకత
Also Read: ఎవరీ విశ్వకర్మ..ఆయన జయంతిని ఎందుకు పండుగలా జరుపుకుంటారు…
Also read: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి