By: ABP Desam | Published : 17 Sep 2021 11:47 AM (IST)|Updated : 17 Sep 2021 11:47 AM (IST)
Edited By: RamaLakshmibai
viswakarma
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ. వాహనాలు, ఆయుధాలతో పాటు హిందూ దేవుళ్లు, దేవతల రాజభనాల సృష్టికర్త అని చాలా మంది నమ్ముతారు. ద్వారకా నగరాన్ని విశ్వకర్మే సృష్టించాడని చెబుతారు. ఏటా సూర్య భగవానుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి వేడుక జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 శుక్రవారం అంటే ఈ రోజే ఆ వేడుక. ఈ రోజున హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఉంచి ఆరాధిస్తారు. ఈ రోజున వాటిని ఏ పనికీ ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని..నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించేలా చేయాలని విశ్వకర్మని ప్రార్థిస్తారు.
విశ్వకర్మను దైవ వడ్రంగి, స్వయంభు అని పిలిచేవారు. ఈ పండుగ ఎక్కువగా అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. నేపాల్ లోనూ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. విశ్వకర్మ జయంతి రోజున దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. విశ్వకర్మ వాహనం అయిన ఏనుగును కూడా ఈ రోజు పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. అన్నదానాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. వేదాలు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సృష్టి ఆదినుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదుగురున్నారు. వీరు విశ్వకర్మకు జన్మించినవారే.
సాధారణంగా సృష్టికర్త అంటే బ్రహ్మదేవుడనే అనుకుంటాం. కానీ కొన్ని పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రహ్మ దేవుని కుమారుడని చెబుతారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు.
Also Read: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు వేసి స్వామిని ఇంటి లోపలకు ఆహ్వానించడం వెనుక ఇంత అంతరార్థం ఉందా..!
Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే
Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి
Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది
Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం
Horoscope Today 16th May 2022: ఈ రాశికి చెందిన హార్ట్ పేషెంట్లు తప్పనిసరిగా కాఫీ మానేయాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?