News
News
వీడియోలు ఆటలు
X

Krishna Janmashtami 2021: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు వేసి స్వామిని ఇంటి లోపలకు ఆహ్వానించడం వెనుక ఇంత అంతరార్థం ఉందా..!

ఎలాగోలా బతికేయడం వేరు బతకడం వేరు. బతుకు నేర్పించమని తమ వెన్నంటే ఉండి నడిపించమని కోరుతూ కన్నయ్యను లోపలకు ఆహ్వానిస్తూ కృష్ణాష్టమి రోజు అడుగులు వేస్తారు. ఇంకా ఆ అడుగులు వేయడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే..

FOLLOW US: 
Share:

సాధారణంగా విష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు. కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అయితే ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా, స్నేహితుడిగా(ప్రేమికుడిగా) కొలిచి తరిస్తారు. వాస్తవానికి కృష్ణుడికి భక్తుల కన్నా గురువు, స్నేహితుడిగా భావించే వారి సంఖ్య ఎక్కువని చెప్పాలేమో.

Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే

ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి. కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కార మవుతాయి. కానీ అస్సలు రెమిడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిహారం కావు. కేవలం గురువు ఆశీర్వచనం ఉంటే పరిష్కారం అవుతాయి. అందుకే వేదం చదువుకున్న పండితుడితో శతాయుష్మాన్ భవం..శత మనంతంభవతి అనే ఆశీర్వచనం పొందాలని భావిస్తారు. తద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో గురుతత్వాన్ని చూపించిన అవతారం కృష్ణడొక్కటే. అందుకే కృష్ణుడిరాకతో ఇంట్లో ఉంటే దోషాలు తొలగిపోతాయని భావించి స్వామి అడుగులు లోపలకి వేస్తారు.


Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!

రాముడిని రామాయణం అంటాం. అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. కేవలం కృష్ణుడిని మాత్రమే కృష్ణతత్వం అంటారు. తత్వం అంటే ఏ యుగంలో వారైనా అన్వయించుకోవచ్చు. రాముడిని త్రేతాయుగంలో కొందరు పూజించారు...కలియుగంలోనూ పూజలందిస్తున్నాం. కానీ కృష్ణుడిని కొందరు రుషులు పండితులు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. వ్యాసభగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అని తేల్చేశాడు. సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం. అందుకే  గురువుగా, స్నేహితుడిగా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చెడుమార్గంలో నడిపించకుండా చూడాలని కృష్ణుడి అడుగులు వేస్తారు.

Also Read:మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం

వాస్తవానికి కురుక్షేత్రం సంగ్రామం పూర్తికాకముందే అర్జునుడు ఆయుర్దోషం పొందుతాడని(చనిపోతాడని) రుషులు ముందే చెబుతారు. కానీ యుద్ధం చివరి వరకూ అర్జునుడు ఉన్నాడు. మొత్తం యుద్ధం ముగిసిపోయింది..అందర్నీ చంపేశా అని అర్జునుడు అనగానే...కృష్ణుడు అర్జునిడితో రథం కిందకు దిగు అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు కూడా కిందకు దిగి రథం చుట్టూ ప్రదిక్షిణ చేస్తాడు. వెంటనే ఆ రథం పెళపెళమని విరిగి బూడిదైపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు...భీష్ముడు, ద్రోణులు, కర్ణుడు లాంటి వారు వేసిన బాణాలతో ఎప్పుడో రథం కాలిపోయింది. కానీ గురువుగా, స్నేహితుడిగా నీవెంట ఉన్నా కాబట్టే  కాలిన రథం కాలినట్టు నీకు కనిపించలేదంటాడు. అదే కృష్ణతత్వం. అర్జునుడినికి దోషాల నుంచి విముక్తి కల్పించినట్టే తమని కూడా కాచుకుని ఉండాలని పాదముద్రలు వేస్తారు.

ఇక లౌకికంగా చూస్తే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే కృష్ణుడు ఉన్న ప్లేస్‌ని బృందావనం అంటారు. బృంద అంటే తులసి... బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం. ఆ ఆనందం వనంలా పెరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించి ఆనందాన్నివ్వమని కృష్ణుడిని ఆహ్వానిస్తాం. కృష్ణుడు ఎక్కడా పని చేయడు..చేయిస్తాడు. యుద్ధం చేయలేదు..అర్జునిడితో చేయించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని.. వెళుతున్న మార్గంలో అవరోధాలు తొలగించమని.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సాధారణంగా భగవంతులందరూ, విష్ణువు అవతారాలు, యోగులు, మహర్షులు అందరూ ఉత్తరాయణంలోనే జన్మించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం. ఇక దక్షిణాయనం చీకటికి ప్రతీక. దక్షిణాయనం కర్మకి ఆధారం. పైగా శ్రావణమాసం వర్ష రుతువు అంటే వెన్నెల రాదు. చీకటితో నిండి ఉంటుంది. వర్ష రుతువులో శుక్ల పక్షం-కృష్ణ పక్షంలో కృష్ణ పక్షం పూర్తి చీకటిగా ఉంటుంది. మనిషి పూర్తిగా చీకటిలోకి వెళ్లి పోయేటప్పుడు తీసుకొచ్చేవాడు గురువు ఒక్కడే. పైగా చీకటిలో చెరసాల.. అంటే మనిషి ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నాడన్నమాట. అలాంటి అంధకారం లోంచి వెలుగులోకి నడిపించేవాడే గురువు. అందుకే దక్షిణాయణం-కృష్ణపక్షంలో చిమ్మ చీకటి మధ్య జన్మించిన కన్నయ్య.. మన జీవితాల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలని..జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానానిస్తారు.

కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నా..స్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ అర్థం కావాలంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. చివరిగా ఒక్కమాట...బతికేస్తున్నాం అనుకోవడం వేరు బతకడం వేరు...బతుకు నేర్పమని అడుగుతూనే కృష్ణుడి అడుగు వేస్తాం.

Published at : 30 Aug 2021 05:05 PM (IST) Tags: Krishna Janmashtami 2021 Story Behind The Foot Prints Of Lord Krishna Krishnashtami 2021

సంబంధిత కథనాలు

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

మే 27 రాశిఫలాలు, ఈ రోజు రాశులవారు మంచి గుర్తింపు పొందుతారు!

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

New Parliament Opening:  కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం