Bheemla Nayak Collections: 'భీమ్లానాయక్' రెండు రోజుల కలెక్షన్స్, ఎంతంటే?
హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'భీమ్లానాయక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది.
ప్రాంతాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్..
నైజాం రూ.17.75 కోట్లు
సీడెడ్ రూ.5.10 కోట్లు
ఉత్తరాంధ్ర రూ.3.40 కోట్లు
ఈస్ట్ రూ.2.70కోట్లు
వెస్ట్ రూ.3.44 కోట్లు
గుంటూరు రూ.3.12కోట్లు
కృష్ణా రూ.1.53కోట్లు
నెల్లూరు రూ.1.36 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్) రూ.38.04కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.5.00 కోట్లు
ఓవర్సీస్ రూ.9.00 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) రూ.52.04 కోట్లు
ఈ సినిమాకి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజుల్లో రూ.52.04 కోట్ల షేర్ ను రాబట్టిందంటే.. లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం.
View this post on Instagram