By: ABP Desam | Published : 26 Jul 2021 04:52 PM (IST)|Updated : 26 Jul 2021 04:52 PM (IST)
Bellamkonda Srinivas
టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న 'ఛత్రపతి'(Chatrapathi) సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పుడు హిందీ రీమేక్ ను వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా.. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో హీరోయిన్ గా ఎవరని తీసుకున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దక్షిణాది ముద్దుగుమ్మ రెజీనాను (Regina Cassandra) హీరోయిన్ గా తీసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు అన్ని మీడియా వర్గాలు ఈ వార్తను కవర్ చేశాయి. కానీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదని టీమ్ గట్టిగానే క్లారిటీ ఇచ్చింది. అంటే రెజీనాను ఎంచుకున్నారనే వార్తల్లో నిజం లేదన్నమాట. నిజానికి ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. దానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గతంలో కూడా బెల్లంకొండ నటించిన సినిమాల కోసం స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ కి బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ బెల్లంకొండ సినిమా కోసం తీసుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం బెల్లంకొండపై ఈ విషయంలో నిరాశ ఎదురుకాక తప్పదు.
ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లంతా కూడా కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అలియా భట్ (Alia Bhatt)రూ.10 కోట్లు.. కత్రినా కైఫ్ రూ.12 కోట్లు.. తీసుకుంటున్నారు. శ్రద్దాకపూర్ లాంటి మిడ్ రేంజ్ హీరోయిన్లు ఎనిమిది కోట్లు అడుగుతున్నారు. అనన్య పాండే, సారా అలీ ఖాన్ లాంటి కుర్ర హీరోయిన్లు సైతం నాలుగు నుండి ఆరు కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ లెక్కన చూస్తే బెల్లంకొండపై ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దొరకాలంటే చాలా కష్టం. పైగా బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి యంగ్ హీరో పక్కన నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ముందుకు రావడం లేదట. కానీ యూనిట్ వర్గాలు మాత్రం కచ్చితంగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉంటుందని చెబుతోంది.తప్పనిసరిగా స్టార్ కావాలంటే మాత్రం మూవీ బడ్జెట్ పెంచాల్సిందే. డైరెక్టర్, హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూస్ గా 35 రోజులు కాల్షీట్లు ఇచ్చే హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆలస్యమైనా కూడా ప్రాజెక్ట్ కి అన్ని విధాలా సరిపడా హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?
KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!
Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !