అన్వేషించండి

Balakrishna: 'సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి'

నందమూరి బాలకృష్ణ.. దివంగత సీతారామశాస్త్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సైతం నివాళులు అర్పిస్తూ.. సిరివెన్నెలతో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

''తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ రాసుకొచ్చారు. 
 
బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహం తీసుకురానున్నారు. ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. బుధవారం ఉదయం 5 గంటల వరకూ కిమ్స్ హాస్పిటల్లోనే సిరివెన్నెల భౌతికకాయం ఉండనుంది. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నారు.
 
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. 

Also Read:'ఆయన కలం నేడు ఆగినా.. రాసిన అక్షరాలు నిలిచే ఉంటాయి'

Also Read:సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Goodachari 2 First Review : అడివి శేష్ గూఢచారి 2 ఓ అద్భుతం - స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ రివ్యూ
అడివి శేష్ గూఢచారి 2 ఓ అద్భుతం - స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ రివ్యూ
January 12 Vidudala Movie : వెంకీ కల్యాణ్ రామ్, హీరోయిన్స్‌తో సాంగ్ - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ వీడియోస్ లీక్
వెంకీ కల్యాణ్ రామ్, హీరోయిన్స్‌తో సాంగ్ - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ వీడియోస్ లీక్
Gunde Ninda Gudigantalu September 5th: గుండె నిండా గుడిగంటలు: రోహిణికి ఇచ్చిపడేసిన శృతి.. వ్రతంలో కూర్చొవడానికి రోహిణి 'సోది' ప్లాన్! తల పట్టుకున్న ప్రభావతి!
గుండె నిండా గుడిగంటలు: రోహిణికి ఇచ్చిపడేసిన శృతి.. వ్రతంలో కూర్చొవడానికి రోహిణి 'సోది' ప్లాన్! తల పట్టుకున్న ప్రభావతి!
Nindu Noorella Saavasam Serial Today September 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను టూర్ కు పంపించమన్న వార్డెన్ - భయంతో వణికిపోయిన భాగీ 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను టూర్ కు పంపించమన్న వార్డెన్ - భయంతో వణికిపోయిన భాగీ 

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Embed widget