(Source: ECI/ABP News/ABP Majha)
Balakrishna: 'శంకరాచార్య' కథలో బాలకృష్ణ.. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడో..
చాలా కాలంగా బాలయ్య 'శంకరాచార్య' పాత్ర పోషించాలనుకుంటున్నారు. హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి ఆయన.
నందమూరి బాలకృష్ణ కేవలం కమర్షియల్ జోనర్ కి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తన కెరీర్ లో రకరకాల జోనర్లలో నటించారాయన. ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమాలో అఘోరా గెటప్ లో జీవించేశారు బాలయ్య. ఆ పాత్రతో దేవాలయాల గొప్పదనాన్ని, హైంధవ ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా.. బాలయ్య క్రేజ్ ను మరింత పెంచింది. ఇదే జోరులో వరుస సినిమాలను సైన్ చేస్తున్నారు బాలయ్య.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. అలానే లిస్ట్ లో బి.గోపాల్, అనీల్ రావిపూడి వంటి దర్శకులు ఉన్నారు. చాలా మంది కుర్ర దర్శకులు కూడా బాలయ్యను కలిసి కథలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాలయ్య మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
చాలా కాలంగా బాలయ్య 'శంకరాచార్య' పాత్ర పోషించాలనుకుంటున్నారు. హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అతని జీవితాన్ని తెరపై చూపించాలనేది బాలయ్య ప్రయత్నం. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా తయారవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలయ్యతో సి.కళ్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గతంలో వీరిద్దరూ కలిసి 'జై సింహా', 'రూలర్' వంటి సినిమాలకు పని చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్యతో సినిమా తీయాలనుకుంటున్నారు సి.కళ్యాణ్. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ శంకరాచార్యకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమవుతోందని.. బాలయ్య పర్మిషన్ ఇస్తే ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు సి.కళ్యాణ్. స్క్రిప్ట్ గనుక నచ్చితే బాలయ్య నో చెప్పే ఛాన్సే లేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైనా.. పట్టాలెక్కడం మాత్రం ఖాయం.
Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి