అన్వేషించండి
Advertisement
Balakrishna: 'ఎఫ్3' సినిమాకి బాలయ్య రివ్యూ ఇదే!
'ఎఫ్3' సినిమా చూసిన బాలయ్య తన రివ్యూ ఇచ్చారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది.
ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలే రిలీజ్ అవ్వడం కూడా 'ఎఫ్3'కి కలిసొచ్చింది. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసి నందమూరి బాలకృష్ణకు చూపించారు.

సినిమా చూసిన అనంతరం ఆయన 'ఎఫ్3' టీమ్ ని అభినందించినట్లు తెలుస్తోంది. అనిల్- రావిపూడి వర్క్ ను నటీనటుల పెర్ఫార్మన్స్ ను కొనియాడారు బాలయ్య. ఎంతో వినోదాత్మకంగా సినిమా సాగిందని.. ఆయన బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న బాలయ్య తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వలో చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య యాభై ఏళ్ల తండ్రి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఆయన కూతురిగా శ్రీలీల కనిపించనుంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion