Anupama Parameswaran: పవన్ కళ్యాణ్ అంటే అనుపమకి అంత ఇష్టమా?
పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. పవర్ స్టార్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది అనుపమ పరమేశ్వరన్.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో ఆమె నటించిన 'అఆ', 'శతమానం భవతి' వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అదే జోరుని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ఆమె నటించిన 'హాలో గురూ ప్రేమ కోసమే', 'రాక్షసుడు' వంటి ఏవరేజ్ గా ఆడాయి. ఇటీవల విడుదలైన 'అంటే సుందరానికీ' సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది అనుపమ.
నిజానికి ఇదొక సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. అనుపమకు అలాంటి పాత్రలో చూసి షాకయ్యారు చాలా మంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూ.. సపోర్టింగ్ రోల్ ఎలా చేసిందా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈ బ్యూటీ 'బటర్ ఫ్లై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
'బటర్ ఫ్లై' స్టోరీ తనకెంతో నచ్చిందని.. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పిస్తుందని తెలిపింది. తన మొదటి సినిమా విడుదలైన తరువాత నెగెటివ్ కామెంట్స్ బాగా వినిపించాయని.. వాటికి చాలా బాధపడ్డానని.. అయితే అభిమానుల కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. పవర్ స్టార్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.
ఆయన గురించి చెప్పే స్థాయి తనకు ఇంకా రాలేదని తెలిపింది. ఇటీవల ఆయన నటించిన 'భీమ్లానాయక్' సినిమాను థియేటర్లో చూశానని.. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి బురఖా ధరించి.. 'బటర్ ఫ్లై' హీరో నీహాల్ తో కలిసి వెళ్లానని.. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూశానని చెప్పుకొచ్చింది.
Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై
Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్
View this post on Instagram