Sai Pallavi: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్
సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
![Sai Pallavi: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్ Sai Pallavi Opens Up On Her Dressing Sai Pallavi: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/34a247e234a0545a338401b79c6bf923_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మలయాళ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటి సాయిపల్లవి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన నటనతో ప్రతి ఒక్కరినీ అభిమానులుగా మార్చుకుంది. తన డాన్స్ తో ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. మొదటి నుంచి కూడా గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది సాయి పల్లవి. మిగిలిన హీరోయిన్లు మినీ డ్రెస్సులు, బికినీ లంటూ రచ్చ చేస్తుంటే.. సాయిపల్లవి మాత్రం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఇప్పుడు ఆమె నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రానాకి జోడీగా కనిపించనుంది సాయిపల్లవి. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి ఓ రేంజ్ లో బజ్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది సాయిపల్లవి.
ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఇంట్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండడంతో తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటావా..? అని ఇంట్లో అంటుంటారని చెప్పుకొచ్చింది. చదువుతున్న సమయంలో తనకు 23 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని.. 30 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారనుకున్నానని.. తెలిపింది. ఇదే సమయంలో గ్లామర్ షోకి ఎందుకు దూరంగా ఉంటారని ప్రశ్నించగా.. పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదని.. కానీ ఎదుటివారి చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పుకొచ్చింది.
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)