అన్వేషించండి

Anudeep: బిగ్గెస్ట్ బ్యానర్స్ లో అనుదీప్ సినిమాలు - ఆ హీరోలు ఒప్పుకుంటారా?

దర్శకుడు అనుదీప్ చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు అనుదీప్. రీసెంట్ గా ఇతడు డైరెక్ట్ చేసిన 'ప్రిన్స్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ వెర్షన్ కంటే తెలుగులో బాగా ఆడుతుందని హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. 
 
కామెడీ ఉన్నప్పటికీ.. జనాలకు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు. తమిళంలో ఈ సినిమాకి కనీసపు కలెక్షన్స్ కూడా లేవట. ఈ సినిమా వర్కవుట్ అవ్వనప్పటికీ.. అనుదీప్ చేతిలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నట్లు చెప్పారు అనుదీప్. 
 
Anudeep to direct Venkatesh, Ram Pothineni: హారిక హాసిని సినిమా వెంకటేష్ గారితో అనుకుంటున్నామని.. ఇంకా కథ ఓకే అవ్వలేదని చెప్పారు. అలానే హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలని అన్నారు. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ అంటే టాప్ ప్రొడక్షన్ హౌస్ లు. ఈ బ్యానర్స్ లో సినిమాలు పడి.. క్లిక్ అయితే గనుక అనుదీప్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం గ్యారెంటీ. మరేం జరుగుతుందో చూడాలి. 
 
ప్రస్తుతం వెంకటేష్, రామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'ఎఫ్ 3' సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సందడి చేశారు. ఆ తర్వాత ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. వెంకీతో సినిమా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి తేజ వరకు చాలా మంది కథలు చెప్పారు. కానీ, ఏదీ ఓకే కాలేదు. వేరే సినిమాలతో ఆయన దర్శకులు బిజీ బిజీ అవుతున్నారు. హిందీలో హిట్ అయిన 'దే దే ప్యార్ దే' రీమేక్ రైట్స్ వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు దగ్గర ఉన్నాయి. బహుశా... ఆ రీమేక్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వెంకటేష్ సోలో హీరోగా మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు.
 
ఇక రామ్ విషయానికొస్తే.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్ లో యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ ను సాధించాయి. ఆ విధంగా బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తొలిసారి ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి!
 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
Dhanush Mrunal Thakur : ధనుష్, మృణాల్ మధ్య బ్రేకప్... డేటింగ్ రూమర్స్‌లో బిగ్ ట్విస్ట్! - ఆ ప్రచారంలో నిజమెంత?
ధనుష్, మృణాల్ మధ్య బ్రేకప్... డేటింగ్ రూమర్స్‌లో బిగ్ ట్విస్ట్! - ఆ ప్రచారంలో నిజమెంత?
Neno Butterfly Song Lyrics : లూసైంది హార్టు... స్లో అయ్యింది బీటు - సూర్యతో మమితా లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
లూసైంది హార్టు... స్లో అయ్యింది బీటు - సూర్యతో మమితా లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
Breaking News:పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
Gujarat Man Fakes Own Kidnapping: భర్త సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా - భార్య నుంచి 50 లక్షలు గుంజుదామని ప్లాన్ - డామిట్ కథ అడ్డం తిరిగింది!
భర్త సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా - భార్య నుంచి 50 లక్షలు గుంజుదామని ప్లాన్ - డామిట్ కథ అడ్డం తిరిగింది!
Delimitation 2026 Southern States Loss: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం 50 శాతం ఫార్ములా - కాంగ్రెస్ వ్యతిరేకత - మరి ఏకాభిప్రాయ ఫార్ములా ఏమిటి?
Embed widget