అన్వేషించండి
Advertisement
Varudu Kaavalenu: రీతూవర్మలో ఆ క్వాలిటీ బాగా నచ్చిందన్న అల్లు అర్జున్
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు.
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన బన్నీ.. తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.
ముందుగా అల్లరి చేస్తోన్న ఫ్యాన్స్ ను చూస్తూ.. ఇంతమంది జనాలను సినిమా రిలీజ్ తరువాత ఇప్పుడే చూస్తున్నా అంటూ చెప్పిన బన్నీ 'దిగు దిగు నాగ' అంటూ పాట అందుకున్నారు. ఓ రోజు సినిమా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత తన కూతురొచ్చి 'నాన్న దిగు దిగు పెట్టు' అని చెప్తుంటే తనకు అర్ధం కాలేదని.. ఆ తరువాత తమన్ కంపోజ్ చేశాడని తెలిసిందని అన్నారు బన్నీ. నాగశౌర్య చాలా అందగాడు.. తనేం చేసినా అందులో ఇన్నోసెన్స్ ఉంటుంది. తను పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
తనకు సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా ఇష్టమని.. అలా ఎదిగినవాడే శౌర్య అని అన్నారు. రీతూవర్మ ఫస్ట్ సినిమా చూసిన తరువాత.. ఎవరీ అమ్మాయి అని ఫోన్ చేసి కనుక్కున్నానని.. తెలుగమ్మాయిని తెలిసిందని.. తెలుగమ్మాయిలంటే ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఉంటుందని అన్నారు. అమ్మాయిల్లో తనకు డిగ్నిటీ అంటే చాలా ఇష్టమని రీతూవర్మ డిగ్నిటీ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు.
రెండేళ్లుగా కోవిడ్ వలన, టికెట్ రేట్ వలన, యాభై శాతం ఆక్యుపెన్సీ వలన జనాలు థియేటర్లకు రావడం మానేశారని.. ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నారని.. ఈ ఫ్లో మరింత పెరగాలని కోరుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అన్నీ బాగా ఆడాలని కోరుకున్నారు. డిసెంబర్ 17న తన 'పుష్ప' సినిమా కూడా వస్తుందని స్పష్టం చేశారు.
Also Read: 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' బాలయ్య ప్రోమో.. అదిరిపోయిందంతే..
Also Read: ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ వరుణ్ తేజ్ మూవీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
Also Read: ప్రీతమ్తో సమంత ఫొటో.. విదేశాలకు చెక్కేస్తున్నానంటూ..
Also Read: మెగా సినిమా షూటింగ్ కు ముహూర్తం పెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion