అన్వేషించండి
Advertisement
Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్, అలియాకు టైమ్ లేదట
'రాధేశ్యామ్' సినిమా విడుదలైన తరువాత 'ఆర్ఆర్ఆర్' హంగామా మొదలుకానుంది. అయితే ఈసారి ప్రమోషన్స్ కి అలియా దూరంగా ఉంటుందట.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సింది. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. ముంబై, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ సినిమా వాయిదా పడడం వలన ఆ కష్టమంతా వృధా అయింది. ఈసారి కూడా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.
'రాధేశ్యామ్' సినిమా విడుదలైన తరువాత 'ఆర్ఆర్ఆర్' హంగామా మొదలుకానుంది. అయితే ఈసారి ప్రమోషన్స్ కి అలియా దూరంగా ఉంటుందట. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అలియా చాలా బిజీగా ఉందట. ప్రమోషన్స్ కి సమయం కేటాయించలేకపోవచ్చని అంటున్నారు. పైగా ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో పాల్గొన్నానని.. మళ్లీ ఫ్రెష్ గా మొదలుపెట్టాల్సిన అవసరం లేదనేది ఆమె ఫీలింగ్.
మరోపక్క అలియాను భరించడం 'ఆర్ఆర్ఆర్' నిర్మాతలకు కూడా కాస్త కష్టమే. ఇదివరకు అలియా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు రెండు వారాల సమయం కేటాయించింది. ఆ పదిహేను రోజుల్లో అలియాభట్ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారట. ఆమెకి, అలానే స్టాఫ్ కి ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్ ఇలా అన్నీ కలుపుకొని మూడు కోట్ల వరకు అయిందట. దీంతో ఈసారి ఆమెని లైట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ముంబై ఈవెంట్ లో మాత్రం ఆమె కనిపిస్తుంది. సౌత్ లో ఆమె కనిపించే ఛాన్స్ లేదు.
రీసెంట్ గా అలియా భట్ నటించిన 'గంగూబాయి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కొన్ని రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ ఫిలింలో కనిపించబోతుందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ సంస్థ రూపొందిస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాళ్ గాడోట్ లీడ్ రోల్ పోషించనుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion