Ala Ninnu Cheri: ఓటీటీలోకి వచ్చిన దినేష్ తేజ్, హెబ్బా పటేల్ సినిమా 'అలా నిన్ను చేరి'
Ala Ninnu Cheri streaming on Prime Video: హెబ్బా పటేల్ ఓ కథానాయికగా నటించిన 'అలా నిన్ను చేరి' సినిమా ఓటీటీలో విడుదలైంది.
Prime Video OTT Telugu Movies: కుర్రకారులో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. తెలుగులో 2023లో ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి... 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. డైరెక్టుగా ఓటీటీలో విడుదల అయ్యింది ఆ సినిమా! హెబ్బా పటేల్ నటించిన మరో సినిమా... 'అలా నిన్ను చేరి'. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దినేష్ తేజ్ హీరోగా 'అలా నిన్ను చేరి'
Ala Ninnu Cheri Movie OTT Release: సుకుమార్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన 'ప్లే బ్యాక్'లో హీరోగా నటించిన అబ్బాయి గుర్తు ఉన్నారా? అతని పేరు దినేష్ తేజ. ఆ సినిమా కంటే ముందు 'హుషారు' సినిమాలో ఓ హీరోగా నటించారు.
Also Read: ఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత
దినేష్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'అలా నిన్ను చేరి'. హెబ్బా పటేల్ ఓ హీరోయిన్ కాగా... పాయల్ రాధాకృష్ణ మరో హీరోయిన్. ఈ సినిమా 2023 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సైలెంట్‌గా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
ప్రైమ్ వీడియో ఓటీటీలో 'అలా నిన్ను చేరి'
Ala Ninnu Cheri Movie OTT Platform: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'అలా నిన్ను చేరి' స్ట్రీమింగ్ అవుతోంది. ''కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రంగా 'అలా నిన్ను చేరి'ని తెరకెక్కించాం. థియేటర్లలో విడుదల అయినప్పుడు విమర్శకుల పాటు ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు మా సినిమాకు ఓటీటీలో కూడా మంచి స్పందన లభిస్తోంది'' అని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read: 'సలార్' ఫ్లాప్, ప్రభాస్ కంటే డెడ్ బాడీ నయం - విషం చిమ్ముతున్న బాలీవుడ్
The fun, action and emotional family entertainer #AlaNinnuCheri which received positive response after its theatrical release is streaming right now on @PrimeVideoIN
— BA Raju's Team (@baraju_SuperHit) December 23, 2023
Watch the movie with your family members and get entertainedhttps://t.co/wZVRVOSEDy@idineshtej @ihebahp… pic.twitter.com/LPvX6LdWTb
''కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని ఆకట్టుకునేలా దర్శకుడు మారేష్ శివన్ సినిమా తెరకెక్కించారు. ఆయన కథ, కథనం, దర్శకత్వం పట్ల అందరూ ఫిదా అయ్యారు. ఆయన రాసిన మాటలు గుండెల్ని హత్తుకున్నాయని చాలా మంది చెప్పారు'' అని హీరో దినేష్ తేజ్ అన్నారు. 'హుషారు' తర్వాత మళ్లీ ఆయన ఆ స్థాయి విజయం ఇదని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. తప్పకుండా ఈ సినిమాను ఓటీటీలో చూడాలని కోరింది.
Also Read: ఆ ఓటీటీలోకి ‘మంగళవారం’ - ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్, మరి స్ట్రీమింగ్ డేట్?
మహబూబ్ బాషా, మహేష్ ఆచంట, చమ్మక్ చంద్ర, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కర్నాటి రాంబాబు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం: ఐ ఆండ్రూ, సంగీతం: సుభాష్ ఆనంద్, నిర్మాణ సంస్థ: విజన్ మూవీ మేకర్స్, సమర్పణ: కొమ్మాలపాటి శ్రీధర్, నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్.