అన్వేషించండి

Salaar: 'సలార్' ఫ్లాప్, ప్రభాస్ కంటే డెడ్ బాడీ నయం - విషం చిమ్ముతున్న బాలీవుడ్

Salar Flop Show trends on Twitter: 'సలార్' సినిమాకు ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ జనాలు కొందరు విషం చిమ్ముతున్నారు. 'సలార్' ఫ్లాప్ అంటూ పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

Negative PR on Prabhas Salaar: 'సలార్' సక్సెస్ చూసి షారుఖ్ ఖాన్ అభిమానులు, బాలీవుడ్ జనాలు అసూయ పడుతున్నారా? సినిమాకు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్ళు సాధిస్తోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ప్రభాస్ మీద, 'సలార్' సినిమాపై కొందరు విషం చిమ్మడం స్టార్ట్ చేశారు. 

ఏవండోయ్ ఇది విన్నారా?
'సలార్' సినిమా ఫ్లాప్ అంట!
Salar Flop Show trends on Twitter: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే... 'ఎవరు ఏమనుకుంటే మాకేంటి? మేం చెప్పాలి అనుకున్నది చెబుతాం. అబద్ధాలు ఆడతాం' అన్నట్లు ఉంది కొందరు వ్యవహారం. 'సలార్' సినిమాకు మొదటి రోజు సుమారు రూ. 180 కోట్ల రూపాయల వసూళ్ళు వచ్చాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ రెండు వేలు, నాలుగు వేలు పెట్టి కొన్న అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ టికెట్స్ దొరక్క చాలా మంది ట్రై చేస్తున్నారు.

సినిమాలో లోపాలు లేవని కాదు. కానీ, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాలీవుడ్ జనాలు కొందరు మాత్రం 'సలార్ ఫ్లాప్' అంటున్నారు. 'సలార్' ఫ్లాప్ షో అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ప్రభాస్ కంటే చచ్చినోడు నయం!
ఈ కామెంట్ చేసినోళ్లను ఏమనాలి!
ప్రభాస్ కంటే డెడ్ బాడీ (శవం) ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందని వీడియోలో ఓ ఇద్దరు కూర్చుని కామెంట్ చేశారు. 'వాళ్ళను ఏమనాలి అసలు!' అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే... దేవా పాత్రను చూడటం కామెంట్ చేసే హిందీ జనాలకు రాదని అనుకోవాలి. ప్రభాస్ చేసినట్లు ఆ ఫైట్స్ ఎవరు చేయగలరు?

Also Read: సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

మూడు గంటల టార్చర్ 'సలార్'
ఇంకొందరు ఇంకో అడుగు ముందుకు వేసి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)ను చూసి ప్రభాస్ యాక్టింగ్ నేర్చుకోవాలని కామెంట్ చేశారు. బాలీవుడ్ వీడియో క్రిటిక్ ఒకరు 'సలార్ మూడు గంటల టార్చర్' అంటూ కామెంట్ చేశారు.

Also Read: ఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత

'సలార్ ఫ్లాప్ షో' అంటూ కామెంట్ చేసే చాలా మంది 'డంకీ'ని బ్లాక్ బస్టర్ అంటూ పోస్టుల చేయడంతో కావాలని ప్రభాస్ మీద విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోందని తెలుగు ప్రేక్షకులకు అనుమానాలు కలుగుతున్నాయి.  షారుఖ్ ఖాన్ పీఆర్ ఈ పోస్టులు చేస్తుందంటూ ఒకరు ట్వీట్ చేయడం గమనార్హం.

గమనిక: సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్, కొందరు చేసిన పోస్టులను  పాఠకులకు అందించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆయా వ్యక్తులు పోస్టుల్లో పేర్కొన్న అంశాలకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అభిప్రాయాలను ఏబీపీ దేశం అభిప్రాయంగా భావించవద్దని మనవి. దయచేసి గమనించగలరు. 'సలార్' మీద కొందరు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఇక్కడ చూడండి.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today Oct 24: కన్నా పుట్టుక గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న మహా..నారాయణకు చేతులెత్తి మొక్కిన మహాలక్ష్మీ
పొదరిల్లు: కన్నా పుట్టుక గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న మహా..నారాయణకు చేతులెత్తి మొక్కిన మహాలక్ష్మీ
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Illu Illalu Pillalu Serial Today October 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమ్మకానికి స్థలం.. సాగర్, ధీరజ్‌ల షాకింగ్ నిర్ణయం! భద్రావతి పగ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమ్మకానికి స్థలం.. సాగర్, ధీరజ్‌ల షాకింగ్ నిర్ణయం! భద్రావతి పగ!
Gundeninda Gudigantalu Oct 26: బాలు,మీనాపై అలిగిన అలకావతి...మాటలు మాయచేసి తల్లితో అన్నం తినిపించిన బాలు
గుండెనిండా గుడిగంటలు: బాలు,మీనాపై అలిగిన అలకావతి...మాటలు మాయచేసి తల్లితో అన్నం తినిపించిన బాలు

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Tragic Incident in MP: మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
Rajinikanth Nayanthara : రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Embed widget