అన్వేషించండి

Sankranti 2024 movies: ఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత

Sankranti 2024 movies Telugu: రాబోయే సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. ఆయా నిర్మాతలు శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం అయ్యారు.

Sankranti 2024 Telugu movie releases: తెలుగు చిత్రసీమలో ప్రతి పండక్కి రెండు మూడు కొత్త సినిమాలు విడుదల కావడం కామన్! అందులో మినిమమ్ ఒక్కటైనా డబ్బింగ్ సినిమా ఉంటుంది. అయితే... రాబోయే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు కాకుండా ఐదారు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో అగ్ర హీరోలు, యంగ్ స్టార్స్ నటించినవి నాలుగు ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు, ఆ పోటీ గురించి చర్చించడానికి శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు సమావేశం అయ్యారు. 

సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారు?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. అదే రోజు మహేష్ సినిమాతో పాటు యంగ్ హీరో తేజా సజ్జాతో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హను-మాన్' కూడా విడుదల కానుంది.

'గుంటూరు కారం', 'హనుమాన్' విడుదలైన తర్వాత రోజు థియేటర్లలోకి 'సైంధవ్', 'ఈగల్' రానున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' నిర్మిస్తోంది. ముందు నుంచి సంక్రాంతి బరిలో సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. నిజానికి, విక్టరీ వెంకటేష్ 'సైంధవ్'ను ఈ క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, 'సలార్' రావడంతో కుదరలేదు. 

Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!

సంక్రాంతి బరిలో అందరి కంటే లేటుగా వచ్చిన హీరో కింగ్ అక్కినేని నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాస చిట్టూరి 'నా సామి రంగ' నిర్మిస్తున్నారు. ఇంకా విడుదల తేదీని అధికారికంగా చెప్పలేదు. కానీ, జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

థియేటర్ల సర్దుబాటుకు నిర్మాతల మీటింగ్!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు నేతృత్వంలో జరిగిన సమావేశానికి 'గుంటూరు కారం' నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తరఫున ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ, 'ఈగల్' నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, 'నా సామి రంగ' నిర్మాత శ్రీనివాస చిట్టూరి హాజరు అయ్యారు. 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే... సమస్య ఓ కొలిక్కి రాలేదని, మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

వెనక్కి తగ్గేది లేదంటున్న నిర్మాతలు!
సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గడానికి నిర్మాతలు ఎవరూ సుముఖంగా లేరని ఫిల్మ్ ఛాంబర్ సన్నిహిత వర్గాల నుంచి అందించిన సమాచారం. 'గుంటూరు కారం' సినిమాకు క్రేజ్ ఉన్నప్పుడు తాము ఎందుకు వెనక్కి తగ్గాలని నాగవంశీ గతంలో చెప్పారు. తాము ముందు నుంచి థియేటర్ల అగ్రిమెంట్లు స్టార్ట్ చేశామని 'ఈగల్' నిర్మాత చెబుతున్నారు. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అందువల్ల, తాము వెనక్కి తగ్గేది లేదన్నట్టు ఉన్నారట. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ తమ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. మరి, చివరకు ఏ సినిమా వెనక్కి వెళుతుందో చూడాలి. 

Also Read: ఆ మూడు చిత్రాల రికార్ట్స్‌ను బ్రేక్ చేసిన ‘సలార్’, ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ప్రస్తుత ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు అగ్ర నిర్మాత మాత్రమే కాదు... ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా! సంక్రాంతి సినిమాల్లో 'గుంటూరు కారం'తో పాటు మరో పెద్ద సినిమాను నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. మరి, నిర్మాతల మధ్య సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలాం'ను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ... ఆ సినిమా వెనక్కి తగ్గింది. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మాత్రం రానుంది.

Also Readసలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget