అన్వేషించండి

Salaar Movie Review - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?

Salaar Review In Telugu: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

Salaar Movie Review
సినిమా రివ్యూ: సలార్
రేటింగ్: 2.75/5
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ తదితరులు
ఛాయాగ్రహణం: భువన గౌడ
సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: విజయ్ కిరగందూర్
కథ, కథనం, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2023 

Salaar part 1 ceasefire movie review: 'బాహుబలి'తో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే, ఆ స్థాయి విజయం రాలేదు. 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో ప్రభాస్ సినిమా చేయడంతో మాంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశ పడ్డారు. మరి, సినిమా ఎలా ఉంది?

కథ (Salaar Movie Story): తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది ఆద్య (శృతి హాసన్). ఖాన్సార్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో రక్షణ కోసం బిలాల్ (మైమ్ గోపి)కి ఫోన్ చేస్తారు. దేవా (ప్రభాస్) సూచనలను పాటిస్తూ... ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి, అతడి దగ్గరకు తీసుకువెళతాడు. 

దేవా బొగ్గు గనుల్లో పని చేస్తుంటే... అతడి తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఏడేళ్ళ క్రితం ఏం జరిగింది? ఖాన్సార్ కర్త (అంటే రాజు) రాజ మన్నార్ (జగపతి బాబు) తర్వాత ఆయన కుర్చీ మీద కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో... రాజ మన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)కు అండగా నిలబడిన దేవా ఏం చేశాడు? అనేది సినిమా.

విశ్లేషణ (Salaar Review In Telugu): 'కెజియఫ్' అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది... కథ, కథనం కంటే హీరోయిజం! హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు! మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. వందల కోట్ల వసూళ్ళకు కారణం కూడా ఆ హీరోయిజమే! అయితే... 'కెజియఫ్'లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. 'సలార్'కు వస్తే... ఆ హీరోయిజం మిస్ కాలేదు. కానీ, కథ కాస్త డిజప్పాయింట్ చేస్తుంది.

'సలార్'లో ఏముంది? అని చూస్తే... 'హీరోయిజం! హీరో ఎలివేషన్లు! అంతేగా' అని క్లుప్తంగా, ఆలోచించకుండా చెప్పవచ్చు. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి... ప్రభాస్ కటౌట్ & పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్లుగా ఇచ్చారు. కానీ, కథ & కథనం విషయంలో డిజప్పాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్స్ మధ్యలో కథ చిన్నబోయింది. 

'ఉగ్రమ్'ను అటు ఇటు తిప్పి 'సలార్'గా తీశారా? లేదంటే ఇది కొత్త కథ? అనేది పక్కన పెడితే... 'ఉగ్రమ్' కంటే 'కెజియఫ్'ను అన్ని భాషల ప్రేక్షకులూ చూశారు. 'సలార్' సెకండాఫ్ చూస్తుంటే... 'కెజియఫ్'కు, ఈ సినిమాకు మధ్య చాలా అంటే చాలా పోలికలు కనపడతాయి. క్యారెక్టర్లు కొత్తవి అయినా... కథ, కథనాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇండియా వచ్చిన అమ్మాయి చివరకు సురక్షితంగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే... కథ ప్రారంభం, ముగింపు సరిపోయాయి. కానీ, మధ్యలో చూపించిన రక్తపాతం, హింసకు అసలైన ముగింపు ఇవ్వలేదు. రెండో పార్టు కోసం దాచి పెట్టారు. ముఖ్యంగా హీరో చేసే యుద్ధం అతని కోసం కాదు, స్నేహితుడి కోసం! అది ఎంత మందికి నచ్చుతుందనేది చూడాలి. 

బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్బేధ్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్ను వేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, బయట నుంచి లోపలకు వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం వంటివి 'కెజియఫ్ 1'ను తలపించాయి. అయితే... క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను 'కెజియఫ్' నుంచి వేరు చేసింది. లేదంటే సేమ్ టు సేమ్ అన్నట్లు ఉండేది. 

'సలార్' ఫస్టాఫ్ విషయంలో కంప్లైంట్స్ లేకున్నా... ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొడుకు కోసం తల్లి ఎందుకు అలా ప్రవరిస్తుంది? అనేది తర్వాత తెలుస్తుందని సరిపెట్టుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత మరోసారి యాక్షన్ హైలైట్ అవుతుంది కానీ కథ కాదు. ఎమోషన్స్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించలేదు. నిడివి తగ్గిస్తే బావుంటుందనే ఆలోచన వస్తుంది. పాటలు ఆశించిన స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ 'కెజియఫ్' తరహాలో ఉన్నాయి.    

నటీనటులు ఎలా చేశారంటే: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు! 'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తుంది. ఆ కటౌట్‌కు సరిపడా, అటువంటి కంటెంట్ పడి చాలా రోజులైందని గుర్తొస్తుంది. హీరోయిజం, ఆ హీరో ఎలివేషన్స్ ప్రభాస్ కటౌట్ ఉండటంతో వర్కవుట్ అయ్యాయి. ఆయన ఇమేజ్ వల్ల నమ్మేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సులలో ప్రభాస్ అవలీలగా చేసేశారు. ఆ ఫైట్స్ చేయడానికి పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు. ప్రభాస్ లుక్స్ బావున్నాయి.  

ప్రభాస్ తర్వాత ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ హైలైట్ అవుతారు. తమ నటనతో వాళ్ళిద్దరూ ఆకట్టుకుంటారు. కన్న బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీ రావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే. కానీ, ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

Also Read: 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?

చివరగా చెప్పేది ఏంటంటే: 'సలార్'లో ప్రభాస్ కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్సులు, హీరోయిజం ఉన్నాయి. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ప్రశాంత్ నీల్ తీశారు. ప్రభాస్ & యాక్షన్... సినిమాలో ఆ కాంబినేషన్ ఒక్కటే మెప్పిస్తుంది. కథపై అంచనాలు వీలైనంతగా తక్కువగా పెట్టుకుని థియేటర్లకు వెళ్ళండి. లేదంటే డిజప్పాయింట్ అవుతారు. ప్రభాస్ అభిమానులకు, మాస్ జనాలకు నచ్చే చిత్రమిది. 

Also Readప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Embed widget