Salaar: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?
Salaar pre release business worldwide: 'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఎక్కువ రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే...
Salaar Pre Release Business, area wise distribution rights details: 'బాహుబలి'తో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రేంజ్ వంద కోట్లు దాటింది. 'బాహుబలి' మొదటి భాగం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సుమారు రూ. 120 కోట్లకు విక్రయించారు! ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడూ రూ. 200 కోట్లకు తగ్గలేదు. ప్రతి సినిమాకు రేంజ్ పెరుగుతూ వెళుతోంది. ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? వంటి వివరాల్లోకి వెళితే...
'సలార్' వరల్డ్ వైడ్ రైట్స్ @ 345 కోట్లు!
మీరు చదివింది నిజమే! అక్షరాల... మూడు వందల నలభై ఐదు కోట్లకు 'సలార్' డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మారు. ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 144 కోట్లు! 'సలార్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏయే రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు పలికాయి? అనేది చూస్తే...
నైజాం (తెలంగాణ) - రూ. 60 కోట్లు
ఆంధ్ర (అన్ని ఏరియాలు) - రూ. 60 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) - రూ. 24 కోట్లు
ఏపీ & తెలంగాణ కలిపితే... రూ. 144 కోట్లు
ఓవర్సీస్ (విదేశాల్లో) - రూ. 70 కోట్లు
కర్ణాటక - రూ. 30 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) - రూ. 75 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 3 కోట్లు
కేరళ (మలయాళం) - రూ. 6 కోట్లు
తమిళనాడు - రూ. 12 కోట్లు
Also Read: 'సలార్' దెబ్బకు బుక్ మై షో క్రాష్ - ఇదీ ప్రభాస్ రేంజ్
ప్రపంచవ్యాప్తంగా 'సలార్' చిత్రాన్ని 345 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇంచు మించు 'బాహుబలి 2' రేంజ్ అన్నమాట! ఆ సినిమా కంటే రూ. 7 కోట్లు తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రభాస్ టార్గెట్ @ 350 కోట్లు!
Salaar break even target: ఇప్పుడు థియేటర్ల నుంచి 'సలార్' సినిమా మినిమమ్ రూ. 350 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'సలార్' రెండో ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచింది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరు మీద ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే... ఆ మాత్రం కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదని చెప్పాలి. హిట్ టాక్ వస్తే... దానికి డబుల్ కలెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం అవసరం లేదు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు
'సలార్'లో ప్రభాస్ జోడీగా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ నటించారు. ఇతర నటీనటుల విషయానికి వస్తే... ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. అయితే... అందులో ఆమెది ముస్లిం పాత్ర. ఇందులో హిందూ పాత్ర! ఇక, కథలో కీలకమైన వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.