అన్వేషించండి

Dunki Review - 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?

Dunki Review In Telugu: షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డంకీ'. 'పఠాన్', 'జవాన్' విజయాల తర్వాత 2023లో విడుదలైన షారుఖ్ చిత్రమిది.

Dunki Movie Review
సినిమా రివ్యూ: డంకీ
రేటింగ్: 2.5/5
నటీనటులు: షారుఖ్ ఖాన్, బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు
కథ, మాటలు: అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరాణీ, కణికా థిల్లాన్
ఛాయాగ్రహణం: సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
నేపథ్య సంగీతం: అమన్ పంత్
స్వరాలు: ప్రీతమ్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ
విడుదల తేదీ: డిసెంబర్ 21, 2023 

Hindi movie Dunki review In Telugu: 'పఠాన్', 'జవాన్'... 2023లో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ రెండు భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'డంకీ'తో థియేటర్లలోకి వచ్చారు. 'మున్నాభాయ్' సిరీస్, '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు' ఫేమ్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన చిత్రమిది. 'డంకీ' 2023లో షారుఖ్ హ్యాట్రిక్ హిట్ అవుతుందా? సినిమా ఎలా ఉంది?

కథ (Dunki Movie Story): హర్ఢీ సింగ్ థిల్లాన్ (షారుఖ్ ఖాన్) సైనికుడు. అతడిది పఠాన్ కోట్. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని వెతుకుతూ లల్టూ వస్తాడు. అక్కడ మను (తాప్సీ పన్ను) పరిచయం అవుతుంది. మెరుగైన జీవితం కోసం, ఊరిలో కష్టాల నుంచి బయట పడటం కోసం ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులు లండన్ వెళ్ళాలని ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడతారు. కానీ, వీసాలు రావు. అప్పుడు దొంగ దారిలో లండన్ వెళతారు. హార్డీ, మనుతో పాటు మిగతా వాళ్ళు లండన్ ఎలా వెళ్ళారు? ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డారు? లండన్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళ జీవితాల్లో సుఖీ సింగ్ ( విక్కీ కౌశల్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Dunki Movie Review): దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీకి తెలుగులోనూ కొందరు అభిమానులు ఉన్నారు. ఎటువంటి కథ, సన్నివేశంలో అయినా వినోదం మేళవించి చెప్పడంలో ఆయన స్పెషలిస్ట్. '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు' సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మంచి వసూళ్లు సాధించడానికి కారణం ఆయన టేకింగ్ & డైరెక్షన్. 'డంకీ'ని తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా... తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించడానికి కారణం రాజ్ కుమార్ హిరాణీ. దర్శకుడిపై అంచనాలతో 'డంకీ' థియేటర్లలో అడుగుపెట్టిన జనాలకు కాస్త నిరాశ తప్పదు.

'డంకీ' కథను ఒక్క జానర్‌కు పరిమితం చేయలేం. ఇందులో అడ్డదారుల్లో వలస వెళ్ళడానికి కొందరు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? అనేది చాలా హృద్యంగా చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకు కాలం అడ్డు కాదని చెప్పారు. అంతర్లీనంగా దేశభక్తి, మాతృదేశంపై ప్రేమ కూడా ఉన్నాయి. అయితే... అడుగడుగునా రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్ స్టైల్ & ఆయన హ్యూమర్ మిస్ అయిన ఫీలింగ్ ఒక వైపు కలుగుతూ ఉంటుంది. ఏదో వెలితి! ఎమోషనల్ డ్రామాలో డెప్త్ మిస్ అయ్యింది. ఫోర్డ్స్ ఎమోషన్ చెప్పినట్టు అనిపిస్తుంది. 

షారుఖ్ ఖాన్ తర్వాత 'డంకీ' చిత్రానికి ప్రేక్షకులు రావడానికి రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani) పేరు ఎంత ప్లస్ అయ్యిందో... థియేటర్లలోకి వెళ్ళాక ఆయనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అంత మైనస్! వీసా ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్ రాక నటీనటులు పడే అవస్థలు నవ్వులు పూయిస్తాయి. అంతకు ముందు బోమన్ ఇరానీ ఇంగ్లీష్ క్లాసులు అంతగా ఆకట్టుకోవు. కామెడీలో రాజ్ కుమార్ హిరాణీ తన పట్టు చూపించారు. ఎమోషనల్ డ్రామా అంతగా పండలేదు.

నెక్స్ట్ ఏంటి? అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో, ఆసక్తిగా సినిమా చూసేలా చేయడంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వ శైలి కనిపించలేదు. డంకీ రూటులో బోర్డర్ దాటడం అనే పాయింట్ కూడా కొత్త కాదు. హిందీలో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయీజాన్' చేశారు. కాకపోతే... ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఎమోషన్స్ వేరు! 'డంకీ' రూటులో విదేశాలు వెళ్ళిన వాళ్ళను 25 ఏళ్ళ తర్వాత 'డంకీ' రూటులో మళ్ళీ స్వదేశానికి తీసుకు రావడం దర్శకుడి స్టైల్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఎండింగ్‌లో మరో ట్విస్ట్ ఇచ్చారు. కానీ, క్లైమాక్స్ సాగదీశారు. 

పాటలు పర్వాలేదు. ప్రీతమ్ స్వరాలు సందర్భానుసారంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ ఆశ్చర్యపరిచాయి. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ... వీఎఫ్ఎక్స్ సరిగా చేయకపోవడం ఏమిటో?  

నటీనటులు ఎలా చేశారంటే: 'పఠాన్', 'జవాన్' వంటి యాక్షన్ సినిమాల తర్వాత 'డంకీ' లాంటి ఎమోషనల్ డ్రామాతో షారుఖ్ ప్రేక్షకుల ముందుకు రావడం పెద్ద సాహసం. హార్డీ సింగ్ క్యారెక్టర్ కోసం లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ పక్కన పెట్టారు కింగ్ ఖాన్. కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించారు. ఆయన కామెడీ టైమింగ్ మరోసారి ఎంటర్టైన్ చేస్తుంది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేం.

మను పాత్రలో తాప్సీ పన్ను ఓకే. స్వతహాగా పంజాబీ కావడంతో ఆ డ్రసింగ్ స్టైల్ గట్రా బాగా పట్టుకున్నారు. అయితే... తాప్సీలో పంజాబీ పల్లెటూరి అమ్మాయి కంటే మోడ్రన్ మహిళ ఎక్కువ కనిపించారు. విక్కీ కౌశల్ ఎమోషనల్ రోల్ చేశారు. 'డంకీ' థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ గుర్తు ఉంటుంది. బోమన్ ఇరానీతో పాటు మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

Also Read: 'సలార్'కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ - చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!

చివరగా చెప్పేది ఏంటంటే: క్యారెక్టర్, సినిమా కోసం షారుఖ్ ఖాన్ తన ఇమేజ్ పక్కన పెట్టడం అభినందనీయం! నటుడిగా బాలీవుడ్ బాద్షా ప్రతిభ మరోసారి ఆకట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ నుంచి ఆశించే కామెడీ కొన్ని సీన్లలో ఉంది. అయితే... ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తిగా చూసేలా సినిమా లేదు. మధ్య మధ్యలో మెరుపులు తప్ప ఫుల్ ఫ్లెజ్డ్ ఎమోషనల్ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ లేవు. హ్యాట్రిక్ మిస్ అయ్యింది షారుఖ్... సారీ!

Also Readప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget