Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి టైటిల్ ఖరారు చేశారు. అదేంటంటే...
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కు హారర్ సినిమాలు చూడటం అంటే భయం! దెయ్యాలు, ఆత్మలు, భూతాలు నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు చూడరు. హారర్స్‌కు దూరం! విచిత్రం ఏంటంటే... ఆయన ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ తెర మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. ఈ వెబ్ సిరీస్‌కు 'దూత' (Dhootha) టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ (Vikram K Kumar) కలయికలో 'మనం' సినిమా వచ్చింది. అందులో అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాలకు చెందిన హీరోలు నటించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ 'థాంక్యూ' చేస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సోలో హీరో. ఇప్పుడు రష్యా రాజధాని మాస్కోలో షూటింగ్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత, ఇండియా వచ్చాక... 'ధూత' షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఏడాదే సిరీస్ తొలి సీజన్ విడుదల చేయాలని భావిస్తున్నారట.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం 'దూత' (Dootha) చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఆయనకు జోడిగా ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికగా నటించనున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ మాంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా... 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీసేలా పెద్ద స్కెచ్ వేశారట. మొత్తం మూడు సీజన్స్ గా విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉంటాయట.
View this post on Instagram