Akhanda in Australia: ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ’ షో.. పోలీసులు ఎంట్రీ, చివరికి..
నందమూరి బాలకృష్ణ అభిమానుల హంగామా మామూలుగా లేదు. ఆస్ట్రేలియాలో వారు చేసిన హంగామాకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
నందమూరి బాలకృష్ణ నటించిన Akhanda (అఖండ) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య మరోసారి విశ్వరూపం చూపించారు. దీనికి తమన్ సంగీతం కూడా ప్లస్ కావడంతో ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అఖండ’ గురించే టాక్.
అమెరికాలోని డల్లాస్‌లో బాలయ్య అభిమానుల రచ్చ మామూలుగా లేదు. ‘జై బాలయ్య’ అంటూ నినాదాలతో నగర వీధులను, సినిమా హాళ్లను హోరెత్తించారు. భారీ కార్ల ర్యాలీ మధ్య సినిమా హాళ్లకు చేరుకున్నారు. సినిమా నడుస్తున్నంత సేపు అరుపులు, కేకలతో పిచ్చెక్కించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్(Brisbane)లోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానుల హంగామా చూసి థియేటర్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. సినిమా ప్రారంభం కాగానే అభిమానులు స్క్రీన్ వద్దకు వెళ్లి జై బాలయ్య అంటూ నినాదించారు. సినిమా నడుస్తున్నంత సేపు.. కేకలు, అరుపులతో రచ్చ చేశారు. దీంతో సినిమాను కాసేపు ఆపేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
థియేటర్‌లోకి వచ్చిన పోలీసులు.. బాలయ్య అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోండి అని వెల్లడించారు. దీంతో ప్రేక్షకులు కుదురుగా ఉంటామని చెప్పడంతో సినిమా కొనసాగించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లోనే బాలయ్య అభిమానుల హడావిడి ఈ స్థాయిలో ఉందంటే.. ఇక మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
#Akhanda Show has been paused in #Brisbane, Australia.
— OverSeasRights.Com (@Overseasrights) December 2, 2021
Fans have been warned by the Cops to control their excitement. pic.twitter.com/50IV1newml
Situation at Brisbane #Akhanda#AkhandaMassJathara pic.twitter.com/3qZJOmGi8k
— H C (@hchalasani) December 2, 2021
#Akhand Show time, #Brisbane Kurralla racha🔥 pic.twitter.com/KqFwbbYodL
— Sudheer Kumar (@SudheerKumarJSP) December 2, 2021
First Telugu movie premiere to release in two screens at same time in Brisbane
— Vamsi (@Vamse2507) November 25, 2021
First Telugu movie to release in Gold class at Brisbane#Akhanda 🔥🔥🔥🔥 pic.twitter.com/fXUA4dLkEn
Also Read: ‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఘోరా ఎంట్రీ చూస్తే పూనకాలేనట!
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?
Also Read: 'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..
Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి