Akhanda Twitter Review: ‘అఖండ’ ట్విట్టర్ రివ్యూ.. అఘోరా ఎంట్రీ చూస్తే పూనకాలేనట!

‘‘మెంటల్ ఎక్కేసిందిరా అయ్యా అసలు. ఇంటర్వెల్ ఫైట్ నుంచి స్టార్ట్ అయ్యింది ‘అఖండ’ ర్యాంపేజ్. క్లైమాక్స్ కుమ్ముతూనే ఉన్నాడు. బాల, బోయా, తమన్ కలిపి డ్యూటీ చేశారు’’ - ఓ అభిమాని.

FOLLOW US: 

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే అభిమానుల కోసం బెనిఫిట్ షోలను వేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలయ్య తొలిసారి అఘోరా పాత్రలో కనిపించనున్నారు. గురువారం ప్రివ్యూలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి బాలయ్య ‘అఖండ’ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటీ తదితర వివరాలను చూసేద్దామా. 

ఈ చిత్రం చూసిన ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం.. సినిమా ఫస్ట్ ఆఫ్‌లో అదిరిపోయిందట. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో అఘోరాగా బాలయ్య ఇచ్చే ఎంట్రీ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయట. అలాగే ఫైటింగ్ సీక్వెన్స్ కూడా దుమ్ముదులిపేశాయట. యాక్షన్ సీన్లను ఇష్టపడే అభిమానులు ఈ చిత్రం చూసి పండగ చేసుకుంటారని అంటున్నారు. సెకండాఫ్‌లో కూడా యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉన్నాయట. బాలయ్య ఉగ్రరూపానికి తమన్ సంగీతం తోడు కావడంతో ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయట. విలన్‌గా శ్రీకాంత్ పాత్ర కూడా అదిరిపోయిందని, బాలయ్యతో వచ్చే సన్నివేశాలు పీక్స్ అని అంటున్నారు.

మరో ప్రేక్షకుడి అభిప్రాయం ప్రకారం ఫస్ట్ ఆఫ్ యావరేజ్‌గా సాగుతుందని, అఘోరాగా బాలయ్య ఎంట్రీ తర్వాత సినిమాకు ఊపు వస్తుందట. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లోని సన్నివేశం, క్లైమాక్స్.. అదిరిపోతుందట. అఘోరా పాత్రలో బాలయ్య ఇమిడిపోయారని, ఆయనలా మరెవ్వరూ చేయలేరని అంటున్నారు. తమన్ బీజీఎం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని అంటున్నారు. అయితే, కామెడీ సన్నివేశాలు లేకపోవడం మైనస్ పాయింటని, హీరోయిన్‌తో లవ్ సీన్స్ అంత మెప్పించవని మరికొందరు అంటున్నారు. ఇది ‘లెజెండ్’, ‘సింహా’ సినిమాల టైప్ కాదని.. అంతకు మించని మరో ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు.

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?

Also Read:  'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..

Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 02 Dec 2021 08:47 AM (IST) Tags: Akhanda Balakrishna బాలకృష్ణ Boyapati Srinu అఖండ Akhanda Twitter Review Akhanda Movie Review Akhanda Movie Release

సంబంధిత కథనాలు

F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?

F3 Movie: 'ఎఫ్3' బడ్జెట్ - రెమ్యునరేషన్సే ఎక్కువ?

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

AP PCC Chief Kiran :  ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

KKR vs LSG: క్రికెట్‌ కాదు LSGతో బాక్సింగ్‌ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!

KKR vs LSG: క్రికెట్‌ కాదు LSGతో బాక్సింగ్‌ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి