'అఖండ 2' పై బాలయ్య అసంతృప్తి ..సెప్టెంబర్ 25న రిలీజ్ లేనట్టేనా! ఈ ప్రచారంలో నిజమెంత?
Akhanda 2 Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను..ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా అఖండ 2. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీపై కీలక అప్డేట్ వచ్చింది..

Akhanda 2 Release Date
అఖండ సెకండాఫ్ బాలకృష్ణకు నచ్చలేదా?
మళ్లీ షూట్ చేయడం కుదరక..చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారా?
ముందుగా చెప్పినట్టు సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదా?
ఓజీ సింగిల్ గా నే రాబోతోందా?..అఖండ 2 వాయిదా తప్పదా?
దసరా బరి నుంచి తప్పుకుంటే అఖండ 2 వచ్చేది అప్పుడేనా?
ఈ ప్రచారంలో నిజమెంత?
నందమూరి బాలకృష్ణ కెరీర్ని కీలక ములుపు తిప్పి కంప్లీట్ హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీ అఖండ. వరుస డిజాస్టర్స్ తో ఉన్న బాలకృష్ణ కు అఖండ ఇచ్చిన బూస్ట్ మాటల్లో చెప్పలేం. ఈ సినిమా తర్వాత వరుస హిట్స్ కొడుతూ యంగ్ హీరోలకు పోటాపోటీగా దూసుకెళ్తున్నారు బాలయ్య. అఖండ తర్వాత బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇవన్నీ సూపర్ సక్సెస్ అందించాయ్. ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2పై భారీ అంచనాలున్నాయ్. అఖండ లో అఘోరగా కాసేపు కనిపించిన బాలయ్య పార్ట్ 2 ఆరంభం నుంచి చెడుగుడు ఆడేస్తారట. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ ఓ రేంజ్ లో ఉందంటూ నెటిజన్లు పొగిడేశారు. ఇప్పిటకే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25న అని ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇదే రోజు ఓజీ కూడా రాబోతుండడంతో అఖండ 2 వాయిదా పడుతుందా? ఇద్దరు మిత్రులు పోటాపోటీగా బరిలో దిగుతారా అనే డిస్కషన్ జరిగింది. కానీ ఊహించని విధంగా అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందనే వార్త వైరల్ అవుతోంది.
అఖండ 2 షూటింగ్ టైమ్ లో బాలయ్య-బోయపాటి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చిందంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది. సెకెండాఫ్ లో భాగంగా తెరకెక్కిన కొన్ని సన్నివేశాల విషయంలో డిస్కషన్ జరిగిందట. నాకు ముందు చెప్పిన సీన్ ఇదికాదని బాలయ్య క్వశ్చన్ చేయడం, బోయపాటి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో నిజానిజాలెంతో తెలియదు కానీ..లేటెస్ట్ గా సెకెండాఫ్ విషయంలో బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నారన్నది సమాచారం. సెకెండాఫ్ కి సంబంధించి కొన్ని సీన్స్ చూసిన నటసింహం అంతగా బాలేదని చెప్పారట.
అఖండలో ప్రతి యాక్షన్ సన్నివేశం వెనుకా ఓ కారణం కనిపిస్తుంది.. ఓ ఎమోషన్ కట్టిపడేస్తుంది. అఘోరగా బాలయ్య ఎంట్రీ సీన్ కి విజిల్స్ మారుమోగిపోయాయ్. చిన్నారిని కాపాడే సమయంలో యాక్షన్ సన్నివేశం అయినా.. పోలీస్ స్టేషన్లో అఘోర బాలయ్య విశ్వరూపం అయినా అదుర్స్. ఆలయాల గురించి చెప్పిన సందేశం, తనయుడు అని తెలిసి తల్లిపడే ఆవేదన హృదయాలను కదిలించేలా ఉంటుంది. యాక్షన్ , ఎమోషన్ కలగలిపిన ప్రతి సీన్ బాగా పండింది. కానీ అఖండ 2లో ఆ కనెక్షన్ మిస్సైందని టాక్. అందుకే సెకెండాఫ్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో మరోసారి రీషూట్ చేసే ఛాన్స్ లేదు...అందుకే ఉన్నది ఉన్నట్టుగా మహా అయితే చిన్న చిన్న మార్పులు చేసి రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం లేదని..అక్టోబర్ లేదా డిసెంబర్లో అఖండ 2 రాబోతోందని మరో వార్త వైరల్ అవుతోంది.
ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే...






















