అన్వేషించండి

Aishwarya Lekshmi: అసభ్యకరంగా అక్కడ తాకాడు, పసుపు బట్టలంటేనే భయం పుడుతోంది: ఐశ్వర్య లక్ష్మి

‘పొన్నియిన్ సెల్వన్-1’ బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ.. ఈ మధ్యే ‘మట్టి కుస్తీ’తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా తన చిన్నతనంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది.

గత కొంత కాలంగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో, అవకాశాల కోసం వెళ్తే ఎదురైన ‘కమిట్మెంట్’ల గురించి బయటకు చెప్తున్నారు. సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోల నుంచి ఆయా సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని పలువురు నటీమణులు వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా ఉంది. అన్ని సినిమా పరిశ్రమలకు చెందిన హీరోయిన్లు ఈ విషయం గురించి గొంతెత్తుతున్నారు.

లైగింక వేధింపుల గురించి వెల్లడించిన ఐశ్వర్య లక్ష్మీ

తాజాగా మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కాస్టింగ్ కౌచ్ గురించి కాకుండా, చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. చిన్న వయసులో తాను కేరళలోని గురువాయూర్ టెంపుల్ కు వెళ్లినట్లు చెప్పింది. ఆ సమయంలో ఓ యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులతో తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వివరించింది. ఆ సమయంలో తాను పసుపు రంగు దుస్తుల్లో ఉన్నానని, ఆఘటన తర్వాత తనకు పసుపు రంగు బట్టలు అంటేనే భయం వేసేదని వెల్లడించింది. ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు తన ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్య

తాజాగా ఐశ్వర్య లక్ష్మీ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. పలువురు కీలక నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం షూటింగ్ కొనసాగుతోంది. ఇందులోనూ ఐశ్వర్య లక్ష్మీ అదే పాత్రలో కనిపించనుంది. అటు మలయాళంలో  ‘క్రిస్టోఫర్’, ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే చిత్రాల్లో నటిస్తున్నది. అటు ‘మట్టి కుస్తీ’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తమిళంలో తెరకెక్కిన ‘ఘట్టా కుస్తీ’ అనే చిత్రాన్ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా కంటే ముందే తను తెలుగులో ‘గాడ్సే’ అనే  సినిమాలో నటించింది. సత్యదేవ్ తో కలిసి ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఐశ్వర్యకు కూడా పెద్దగా పేరు రాలేదు.

డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన ఐశ్వర్య 

వాస్తవానికి ఐశ్వర్య లక్ష్మీ ఎంబీబీఎస్ డాక్టర్. సినిమాల మీద ఉన్న ఆసక్తితో డాక్టర్ అయ్యాక యాక్టర్ కావాలి అనుకుంది. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల్లో పలు సినిమాలు చేసింది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.  

Read Also: ఇన్నాళ్లూ ఓపిక పట్టాను, ఇక యాక్షనే - అనసూయ వార్నింగ్

టాప్ హెడ్ లైన్స్

Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Idupu Kayitham Teaser : ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
Godavari Serial Today November 12th: 'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ReNew Power Investments: ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
CII Partnership Summit 2026 Live Updates: ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Embed widget