Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!
ఈ మధ్య ప్రభాస్ హైదరాబాద్, ముంబై చక్కర్లు కొడుతున్నారు. ఫ్యామిలీ హైదరాబాద్‌లో... కొన్ని షూటింగులు ముంబైలో... అందువల్ల ప్రయాణాలు తప్పడం లేదు. ఈసారి రాముడికి టాటా చెప్పిన తర్వాతే హైదరాబాద్ వస్తారట.
'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో ఫాస్ట్‌గా తీస్తున్న సినిమా ఏదైనా ఉందంటే... అది 'ఆదిపురుష్' అని చెప్పాలి. 'సాహో' సినిమాకు కూడా షూటింగ్ డేస్ ఎక్కువే. ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండటం... లొకేషన్స్ ఎక్కువ కావడం... మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో షూటింగ్ స్లోగా జరిగింది. 'రాధే శ్యామ్' గురించి అసలు చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా కొన్నాళ్లు చిత్రీకరణకు వాయిదా పడింది. అయితే, 'ఆదిపురుష్' విషయంలో అటువంటి అనుమానాలు అవసరం లేదు. దర్శకుడు ఓం రౌత్ పక్కా ప్రణాళికతో ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తున్నారు.
Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!
ప్రభాస్ కొన్ని రోజులుగా ముంబైలో ఉంటున్నారు. 'ఆదిపురుష్' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అక్టోబర్ 23న పుట్టినరోజు కావడంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. బర్త్ డే సెలెబ్రేషన్స్ పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు ముంబై వెళ్లారు. 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ చేసుకుని... రాముడికి టాటా చెప్పేసిన తర్వాతే హైదరాబాద్ వస్తారట. ఛార్టెడ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రభాస్, మళ్లీ అందులోనే ముంబై వెళ్లారు.
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
'ఆదిపురుష్' సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం అంటే గ్రాఫిక్స్, సెట్స్ ఎక్కువ అవసరం అవుతాయి కనుక షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ రోజులు పడతాయని అందరూ అనుకున్నారు. కానీ, ఫాస్ట్ పేస్ లో ఓం రౌత్ చిత్రీకరణ చేస్తున్నారు. ఆల్రెడీ జానకి (సీత)గా కనిపించనున్న కృతీ సనన్, లంకేశ్ (రావణుడి)గా కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు ఓం రౌత్. త్వరలో ఆదిపురుష్ (రాముడి)గా కనిపించనున్న ప్రభాస్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశారట.
Also Read: ప్రభాస్ వెరీ పాజిటివ్ గురూ... కాదంటారా? అయితే ఓ లుక్కేయండి!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?
'ఆదిపురుష్' తర్వాత మరో మూడు సినిమాలకు సంతకం చేశారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్), సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి